Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓలు, సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలోని బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తప్పనిసరిగా బడులలో చేర్పించాలన్నారు. అలాగే మండలంలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించి వంద శాతం పూర్తి చేయాలన్నారు. పాఠశాలలను తనిఖీ చేసి తాగునీటి, మరుగుదొడ్లు, మద్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సువర్ణ సునియం, రామ్మూర్తి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, సి ఆర్ పి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img