Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న 9 వారాల వేతనాలు తక్షణమే చెల్లించాలని బికెఎంయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో బికెఎంయు ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 వారాల వేతనాలు వేతనాలు అందాల్సి ఉందన్నారు.కొంత మంది కూలీలకు ఉపాధి దొరకక, కొంత మంది జాబు కార్డులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బినామీ పేర్లతో వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద రైతులకు బోర్లు వేయాలన్నారు. ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయలు వేతనం పడేటట్లు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రఫిక్, నరేష్, పోతురాజు, నరసప్ప,లింగన్న, కూలీలు ఎల్లమ్మ, లక్ష్మి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img