విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, వ్యవసాయ సలహా మండలి సభ్యులు గజేంద్రరెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం బోయ ఈరన్న అనే రైతు పొలంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే కొబ్బరి మొక్కలను రైతులు వారి పొలాల్లోని గట్లు వెంబడి వేసుకొని వాటిని రక్షంచుకోవాలని కోరారు. కొబ్బరి మొక్కలు ద్వారా రైతులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.