విశాలాంధ్ర – పెద్దకడబూరు : రైతుల భూములను కాజేసే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారని రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. గురువారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైతులు పంట భూములు కొనుగోలు చేస్తే కేవలం జిరాక్స్ పత్రాలను మాత్రమే ఇచ్చి, అసలు పత్రాలను ప్రభుత్వం దగ్గర ఉంచుకుని రైతులను మోసం చేయాలని కుట్ర పన్నిందని విమర్శించారు. రైతుల కష్టాలను తీర్చే చీకటి చట్టాన్ని రద్దు చేయడంతో ఆంధ్ర రాష్ట్ర రైతులందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.