విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సోమవారం వర్షం కోసం సప్త భజనలు చేశారు. ముందుగా శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ఆవరణంలో అర్చకులు రైతులు సాగు చేసిన పంటలు వర్షం లేక ఎండిపోతున్నాయని, వర్షం కురిపించి పంటలను కాపాడాలని సప్త భజనలతో వేడుకున్నారు. అలాగే పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో వర్షాన్ని ప్రసాదించాలని స్వామివారికి పదకొండు మంది చిన్నారులు ఒక్కొక్కరు 108 బిందెలు నీళ్లు తెచ్చి మహా శివలింగానికి జలాభిషేకం నిర్వహించి వర్షాన్ని అనుగ్రహించాలని వేడుకున్నారు.