విశాలాంధ్ర-పెద్దకడబూరు : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామంలో సర్పంచులు మూలింటి లక్ష్మి, చిన్న మహాదేవ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను గుర్తించారని తెలిపారు. సచివాలయాల ద్వారా అందజేసే 11 రకాలైన సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు . అనంతరం 120 వివిధ రకాల ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, జగనన్న కాలనీలను పరిశీలించారు. విశిష్టశేవలను అందించిన వాలంటీర్లకు వైసీపీ నేతలు మూకిరెడ్డి, మహాదేవలు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్, వీఆర్వో బి. టి. సురేష్, పంచాయతీ కార్యదర్శి మహేంద్ర, వైసీపీ నాయకులు ఈరన్న, నాగరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.