విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన గ్రామ దేవతలు పెద్ద లక్ష్మమ్మ దేవి, చిన్న లక్ష్మమ్మ దేవి ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ ఆచారి, వినోద్ కుమార్ ఆచారి గంగాస్నానం ఆచరించి చలువబిందెలతో గ్రామ పెద్దలు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి జలాభిషేకము గావించారు. నూతన వస్త్రాభరణం, ఆకుపూజ, కుంకుమార్చనలతో పూజించి, గ్రామంలో వెలసిన అన్ని దేవాలయాలకు వెళ్లి పూజించారు. గ్రామము సస్యశ్యామలంగా పైరు పంటలతో సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు అమ్మవార్ల ఆశిస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చలువ బిందెలను పెద్ద లక్ష్మమ్మ దేవాలయంలో ఉంచారు. పూజ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరసింహాచారి, కేశవాచారి, ఈరన్న ఆచారి గ్రామ సేవకులు భీమన్న, ఉసేని తదితరులు పాల్గొన్నారు.