విశాలాంధ్ర, పెద్దకడబూరు :తూనికల కొలతల మిషన్లకు లీగల్ మెటరాలజీ శాఖకు సంబంధించిన ముద్ర లేకుండా రేషన్ దుకాణా దారులు బియ్యం వస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెటరాలజీ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు రేషన్ షాపుల కొలతల మిషన్లను తనిఖీ నిర్వహించి ముద్రలు వేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 39 రేషన్ షాపులు ఉన్నాయని తెలిపారు. తూనికల మిషన్లలో ఏవైనా తేడాలుంటే సరిచేసి ముద్రించడం జరుగుతుందని వెల్లడించారు. ముద్రలు లేకుండా తూకాలలో అవకతవకలకు పాల్పడితే లీగల్ మెటరాలజీ చట్టం ప్రకారం శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనివార్య పరిస్థితుల్లో ఎవరైనా ముద్రలు వేయించుకోని పక్షంలో ఈ నెల 29న ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, వెరిఫికేషన్ చేయించుకొని ముద్రలు వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెటరాలజీ లైసెన్సుడ్ సిబ్బంది శ్రీనివాసులు, గోవిందు, రాజశేఖర్, డీలర్లు పాల్గొన్నారు.