విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామంలో మొహరం వేడుకలలో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మూలింటి లక్ష్మి, వైకాపా నేత మూకిరెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో జరిగే మొహరం వేడుకల కోసం వచ్చే భక్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు వారు తెలిపారు.