విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టును నిరసిస్తూ, జైలు నుంచి త్వరగా విడుదల కావాలంటూ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు గూడూరు సంజీవ రాయుడు, శెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో 101 కొబ్బరికాయలు కొట్టి తమ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గూడూరు సంజీవరాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల లక్ష్యంగా ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని కోరారు. పోలీసులు, వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ ఆందోళనలను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం టిడిపి కార్యకర్తలు సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ బాబుకు మేము తోడుగా అంటూ చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పత్తి వెంకటనారాయణ, రామచంద్రయ్య, పేరూరు మహేశ్వర్ రెడ్డి, నీర్కట్ గురప్ప, సెట్టి నరసింహులు, పత్తి కృష్ణారెడ్డి, టంగుటూరి రామచంద్ర, అహోబిలం రాంబాబు, సాయినాథ్, వీరయ్య, నాగవర్ధన్ , పేరయ్య పాల్గొన్నారు