Friday, December 8, 2023
Friday, December 8, 2023

టీడీపీ సంక్షేమ పథకాలతో పేదలకు మేలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తుందని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తారాపురం, రంగాపురం, చిన్నకడబూరు, నౌలేకల్, మేకడోన, ముచ్చిగిరి గ్రామాల్లో క్లస్టర్ ఇంచార్జీ నరవ రమాకాంతరెడ్డి అధ్యక్షతన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా తారాపురం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. మహా శక్తి ద్వారా తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు, ఆడబిడ్డ నిధి నుండి 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు నెలకు 1500 వందలు, దీపం పేరుతో సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత పేరుతో సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ లక్ష్మన్న, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, ఆర్ టి ఎస్ కన్వీనర్ దశరథరాముడు, నాయకులు మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, భరత్ కుమార్ కౌశిక్, నరసన్న, వీరేష్ గౌడ్, శివ, నర్సింహులు, మహాదేవ, నాగేష్, అయ్యప్ప, లక్ష్మన్న, ఈరన్న, హజర్ వలి, రాఘవ రెడ్డి, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img