విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో రాజహ్మద్ ఇంటి ముందు ఉంచిన బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం మొదటి సారి కావడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.