విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహ వద్ద ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని అంబేద్కర్ విగ్రహ వద్ద వైసీపీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు యువరాజ్, సతీష్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేయడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అనిల్, ఏసన్న, సుందరం, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.