విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి, గంగులపాడు, చిన్నకడబూరు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. రాగిమాన్ దొడ్డి ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా టిడిపి సానుభూతి పరులు ఉప్పర దేవి, గంగులపాడు ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా టిడిపి సానుభూతి పరులు దూదేకుల చిన్న రంజాన్ ను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందజేశారు. ఇందులో టీడీపీ నాయకులు బాబురావు, వెంకటరామిరెడ్డి, రాముడు, గోనుమాన్ నరసన్న, కలుగొట్ల లక్ష్మన్న, హనుమేష్, సోమన్న, హంపయ్య తదితరులు పాల్గొన్నారు.