Friday, December 8, 2023
Friday, December 8, 2023

అంతిమ విజయం ధర్మానిదే..

మాజీ వైస్ చైర్మన్ సాలీసాహెబ్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : అరాచకం, అన్యాయంపై అంతిమ విజయం న్యాయానిది, ధర్మానిదేనని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాలీసాహెబ్ అన్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణంలో టిడిపి మండల నాయకులు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాలీసాహెబ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష్యసాధింపుగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపి, బెయిల్‌ రాకుండా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను సాక్ష్యాధారాలతో సీఐడీ అధికారులు నిరూపించలేకపోయారన్నారు. టీడీపీ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ మండల కన్వీనర్లు ఎస్.తిమ్మన్న, శ్రీనివాసులు గౌడ్, తంగరడోన ఎంపీటీసీ నరసన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు వీరేష్, టిడిపి సీనియర్ నాయకులు బిణిగేరి శంకరయ్య, నాగన్న, బాలన్న, యుగంధర్, విజయ్, రఫీ తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img