Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

నిర్బంధాల మధ్య విజయవంతంగా విద్యాసంస్థలబంద్

. స్వచ్చందంగా బంద్ పాటించిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు
. ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్ చేయకుండా అడుగడుగునా పోలీసులు నిర్బంధం
. వామపక్ష విద్యార్థి సంఘాలు

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ లో భాగంగా జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాలు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్ చేయించడం జరిగింది. ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్ చేయించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బంద్ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ పొలీస్ స్టేషన్లలో నిర్బంధించడం చాలా దారుణమని విద్యార్ధి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బంద్ అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్, పీడీఎస్ యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్,ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి హరీష్ కుమార్,డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు అయినా పాఠ్య పుస్తకాలు,విధ్యాదీవెన, వసతి దీవెన ఇవ్వలేదనివిద్యార్థులు ఏవిధంగా చదువుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేశారు.అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని దేశంలో ఏ రాష్ట్రాలు అమలు చేయలేదని కానీ మన రాష్ట్రం ప్రభుత్వం దాన్ని అమలు చేసి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు చదువు దూరం చేసే విధంగా 3,4,5 తరగతుల విలీనాన్ని ఉపసంహరించుకొని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని,అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని,రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు పీజీ విద్యార్థులకు విద్యకు దూరం చేసే విధంగా జీఓ నెం. 77 తీసుకువచరని దాన్ని వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజులు వెంటనే కళాశాల యాజమాన్యాలకు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేయాలని వారు అన్నారు, విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్న పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను రద్దు చేయాలని వారు అన్నారు . అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ యాప్ తో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని వారు అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని లేకపోతే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము.ఈ బంద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు అడ్డుకున్నా కూడా విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని వారు తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సోమన్న, శరత్ కుమార్, మునిస్వామి,అశోక కుమార్,శివ కుమార్, మనోహర్, రమణ, రవి, మోహన్, చంటి,వెంకటేష్, హరి,కిరణ్ లతో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,పీడీఎస్ యు,ఏఐడీఎస్ఓ,డిఎస్ఎఫ్, యుఎస్ఎఫ్ఐ,డిఎస్యు సంఘాలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img