Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా నిర్మాణ మహాసభలను జయప్రదం చేయండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కర్నూలు నగరంలో ఆగస్టు 25 26వ తేది జరుతుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు ఈరేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో కరపత్రాలను విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్. ఈరేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల కొరకు పోరాటాలకు విద్యార్థులను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు . కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలంతో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొని వచ్చిందని విమర్శించారు. జాతీయ నూతన విద్యా విధానం వలన పేద మధ్య బడుగు బలహీన అనుగారిన వర్గాల విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష వలె మారుతుందని తెలిపారు . విద్యార్థులకు స్ఫూర్తి అయిన పూలే భగత్ సింగ్, అంబేద్కర్, కెరియర్ నారాయణ గురు వంటి వారి జీవిత చరిత్రలను మరియు వారి సిద్ధాంతాలను పాఠ్యాంశాల నుండి తొలగించి బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ జీవిత చరిత్రను చేర్చి దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. బాల్యం నుంచే విద్యార్థుల మెదడులోకి మతతత్వ భావజాలాన్ని నింపుతున్నారని, జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై పోరాటాలకు సిద్ధం అవ్వాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేస్తుంటే, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా జీవో నెంబర్ 107 108 తీసుకొని వచ్చి మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మార్చారన్నారు. . జీవో నెంబర్ 77 తీసుకుని వచ్చి పీజీ విద్యార్థులకు పై చదువులు దూరం చేశారు. అమ్మబడి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన అంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్లు మౌలిక వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు. నాడు నేడు పేరుతో పాఠశాలలో అభివృద్ధి పేరుతో దోచుకుంటున్న వైసిపి నాయకులు. మెగా డీఎస్సీ నిర్వహించకపోవడం. యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో దీన్ని ఎండగడుతూ భవిష్యత్తు కార్యచరణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు, వీరేష్,నరసింహులు, రాము, రాజేష్ కుమార్, రెడ్డి,విజయ్, బాలాజీ, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img