Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం పనులు చేసి మంచి వేతనం పొందాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఉపాధి కూలీలకు సూచించారు. గురువారం మండల పరిధిలోని హెచ్ మురవణి, దొడ్డిమేకల గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో ఖచ్చితమైన కొలతలతో పని చేసి ప్రభుత్వం నిర్ణయించిన రోజుకు 272 రూపాయల వేతనం పొందాలని కోరారు. పనులకు వచ్చిన కూలీలకే హాజరు వెయ్యాలన్నారు. అలాగే కొత్త గొల్లలదొడ్డిలో తాగునీటి సరఫరాను అడిగి తెలుసుకున్నారు. హెచ్ మురవణి గ్రామంలో వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్థని, మీ ఇళ్ల వద్దకు వచ్చే చెత్తబండిలో వేయాలని ప్రజలకు సూచించారు. దొడ్డిమేకల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img