Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

తుదిశ్వాస వరకు జగన్ తోనే ఉంటాం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : తుదిశ్వాస వరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తామని వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దకడబూరులోని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంపురం రెడ్డి సోదరులు వైసీపీని వీడుతున్నట్లు ఓ చానల్ లో వచ్చిన వార్తలను వారు ఖండించారు. తమకు గిట్టనివాళ్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఎమ్మిగనూరులో రాంపురం రెడ్డి సోదరులు పోటీ చేస్తున్నారని వచ్చే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. 2024 ఎన్నికల్లో మంత్రాలయం నుంచి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మరో మారు పోటీలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, నాయకులు రవిచంద్రా రెడ్డి, గజేంద్ర రెడ్డి, శివరామిరెడ్డి, పూజారి ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img