–మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
–కైరిప్పలల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ
విశాలాంధ్ర – ఆస్పరి : వైసిపి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆలూరు టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవారం మండల పరిధిలోనే కైరిప్పుల గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహిళా శక్తి కార్యక్రమాన్ని టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు పొందుపరిచిన అంశాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేలు, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం తదితర పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమ్మరి బాబు, మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్, డైరెక్టర్ గోవిందు, ఎంపీటీసీలు ఎంపీటీసీలు నరసన్న, రహీంతుల్లా, టిడిపి నాయకులు రవి ప్రకాష్ రెడ్డి, శేషిరెడ్డి, రామకృష్ణ, బసవరాజు, సతీష్ కుమార్, రాఘవేంద్ర, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.