Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఆస్పరిలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

విశాలాంధ్ర- ఆస్పరి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 74 వ జయంతి వేడుకలను వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి శుభకాంక్షలు తెలియజేశారు. అలాగే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులు, బాలింతలు, వృద్ధులకు పళ్ళు, బెడ్లను అందజేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రైతు భరోసా కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం సందేశాన్ని వీక్షించి ఆర్.బి.కె ఆవరణంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, జడ్పిటిసి దొరబాబు, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, మండల జెసిఎస్ కన్వీనర్ బసవరాజు, సొసైటీ సీఈవో అశోక్, ముత్తుకూరు సర్పంచ్ తోయజక్షప్ప, చిన్న హోతూర్ సర్పంచ్ హరికృష్ణ, ఎంపీటీసీ రాధాకృష్ణ, మాజీ డైరెక్టర్ బద్రి, వైకాపా నాయకులు తిమ్మప్ప, ప్రకాష్, రాజన్న గౌడ్, సోమన్న, కౌలిట్లయ్య, కుక్కల రంగన్న హార్టికల్చర్ అసిస్టెంట్ జ్యోతిర్మయి, అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img