Friday, September 22, 2023
Friday, September 22, 2023

ఈ నెల 16 నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ మొత్తం

ఈ నెల 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానున్నట్లు ఆర్థికశాఖమంత్రి హరీశ్‌ రావు వెల్లడిరచారు.శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్‌ సమావేశంలో సీఎం ఆదేశాల మేర ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.ఆగష్టు 15వ తేదీన సీఎం కేసీఆర్‌ లాంఛనంగా 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని తెలిపారు.బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img