ఎస్‌బీఐ నివేదిక
న్యూదిల్లీ : కరోనా మహమ్మారి అనేక కుటుంబాలపై అప్పుల భారాన్ని పెంచేస్తోంది. ప్రజల ఆదాయం పడిపోవడం, జీతాలలో కోత కారణంగా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లు తరలిపోతున్నాయని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఆర్థిక పరిశోథన విభాగం తెలిపింది. అనేక కుటుంబాలు బ్యాంకింగ్, ఇతర విత్త సంస్థల నుంచి రిటైల్, పంట, వ్యాపార రుణాలు తీసుకుంటున్నాయని ఇది ప్రజలపై అప్పుల భారం పెరగడానికి చిహ్నమని పేర్కొన్నది .2019-20లో జీడీపీలో అప్పుల నిష్పత్తి 32.5 శాతంగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 37.3 శాతానికి చేరిందని ఈ నివేదిక వెల్లడిరచింది. ఇదే సమయంలో బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు తగ్గా యని తెలిపింది. వైద్య ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల అప్పులు మరింత పెరుగొచ్చనీ ఇది వారి ఆర్థిక పరిస్థితులను మరింత బలహీనం చేయొచ్చని హెచ్చరించింది. కాగా జూన్‌లో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కొంత పుంజుకున్నాయని ఆ నివేదిక వెల్లడిర చింది. వాక్సిన్ ప్రక్రియను వేగ వంతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతి పుంజుకోనుందని వెల్లడిరచింది. కరోనా, లాక్‌డౌన్ నిబంధనలతో అనేక మంది ఉపాధి దెబ్బతిన్నది. దీంతో అనేక మంది అవకాశం ఉన్న చోట అధిక వడ్డీలకు అయినా అప్పుల చేశారని నిపుణులు పేర్కొంటున్నారు. ఉపాధిని మెరుపర్చడంలో మోడీ ప్రభుత్వం చర్యలు అత్యంత బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.