Friday, December 1, 2023
Friday, December 1, 2023

లక్షద్వీప్‌లో మరిన్ని సడలింపులు

కొచ్చి : లక్షద్వీప్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాలనా యంత్రాంగం లాక్‌డౌన్‌కు సంబంధించి సోమవారం కొన్ని సడలింపులు ప్రకటించింది. కొవిడ్‌ పరిస్థితి కొంత వరకు నిలకడగా ఉన్నప్పటికీ లక్షద్వీప్‌లో 319 కరోనా కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రజల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని పాలనా యంత్రాంగం తెలిపింది. రాజకీయ, సామాజిక, మతపర కార్యక్రమాలకు అనుమతివ్వాలని నిర్ణయిం చింది. అయితే, ఇందుకుగాను లక్షద్వీప్‌ జిల్లా కలెక్టరు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది. వారాంతంలో పూర్తిస్థాయి కర్ఫ్యూ ఉంటుందని, ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తామని తెలిపింది. చేపలు పట్టడం, నిర్మాణ, అభివృద్ధి కార్యకలాపాలకు అనుమతిచ్చింది. వీటితో పాటు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటలవరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతిచ్చింది. ఇది కూడా కేవలం హోండెలివరీకేనని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img