Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయానికి విరాళం అందజేసిన లాయర్ రామకృష్ణారెడ్డి దంపతులు

ఆలయానికి విరాళం అందజేసిన లాయర్ రామకృష్ణారెడ్డి దంపతులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నూతనంగా నిర్మించిన శివాలయానికి పట్టణంలోని లాయర్ రామకృష్ణారెడ్డి, అనురాధ దంపతులు తమ వంతుగా ఆలయానికి 50వేల రూపాయల విరాళమును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, డైరెక్టర్ సూర్య ప్రకాష్ లు దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి పేరిటన ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. అనంతరం దంపతులను ఘనంగా సన్మానిస్తూ జ్ఞాపికను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు