Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

అక్షరాక్షర అనుబంధం

ఎన్నెన్ని వికాస హృదయాలు
ఎన్నెన్ని మేధో తేజస్సులు
కలగొలుపు సృజన సౌరభాలు
పుంకాను పుంకాల పుస్తకాలు
వందలాది రచయితలు
వేలాది రచనలు
లక్షలాది పుటలు
కోటానుకోట్ల రసవత్‌ వాక్యాలు
ఆకలి తీర్చు అన్నపూర్ణలు
అరచేతిలో స్వర్గాలు
మనిషికి ఆరో ప్రాణం అక్షరాలు
I I I
నీవెక్కడ ఉంటే –
అక్కడే ఈ – ఈ లైబ్రరీ
నీతోనే నీలోనే
కడవరకు కరచాలనం
కావలసిందల్లా –
అనంత ఆసక్తి
అనల్ప అనురక్తి
అవిశ్రాంత జిజ్ఞాస
తనివి తీరని తపన
కొరత లేని కామన
నిరంత్రాన్వేషణలు
జతగా…..
చిట్టి పరికరం, పొట్టి చార్జర్‌
గట్టి దృష్టి
ఒట్టి వాత్సల్యం – ఇక
నీవో సకల కళావైపుడవు
నీవో సంచార గ్రంథాలయం
నిలువెత్తు సరస్వతి నిక్షిప్త రూపం
నీలోనే – నీతోనే నిఖిల ప్రపంచం
I I I
అరల అల్మరాలక్కర్లేదు ఇక
ఈ ‘ఈ పుస్తక’ నేస్తం
అంచులు మాయవు
కుట్లు సడలవు, ఊడవు
బైండిరగ్‌ విడిపోదు
పుటలు పిగిలిగిపోవు
రూపుమాసిపోదు
తుట్టెలు తుట్టెలుగా
చదవని చిత్తానికి తుట్టేలా పట్టే
చెదలు పలాయన మంత్రం
అటకలకు అందే ఊపిరి
ఇల్లంతా ఇక కరుచుకు పరచుకోవు
ఇక ఇరవైనాలుగ్గంటల గంటల
ఇల్లాలి నస అసలే ఉండదు
అడుగడుగునా అడ్డంపడే అవస్థలు ఉండవు
జతలోని విన్యాసలాస్యాలు ఉండవు
జీవ గుణ రాహిత్య నిర్జీవ గృహం
గుహజీవన తిరోగమనం
I I I
ఎవరికీ కనిపించని …
గుప్త నిధులు, రస రమ్యగనులు
జగతికి సాంకేతిక ప్రసాదం
చేసుకున్న వారికి …‘లా’
వాడుకున్న వారికి వాడుకున్నంత
గగన విహారం లోనూ…
తూకాల తకరాలు ఉండవు
పన్నుల నకరాలు ఉండవు
I I I
పుస్తక ప్రత్యామ్నయం కాదు ఇది
అణువణువు అక్షరాక్షరనుబంధం
నవ్య, భవ్య, దివ్య, దేదీప్య, సవ్య, కావ్య
ప్రపంచ పరిష్వంగ పరవశం
విశ్వ మానవ వికాస వివసత్వం
-లలితానంద్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img