Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

ఏమున్నది గర్వకారణం…!

స్వాతంత్య్రం సిద్ధించి
ఏడు పదులాయె
పేదల కష్టాలు తీరలేదాయె
పరాయి పాలనలో
బతుకు బానిసాయె
స్వపాలనలో స్వరం పెగలదాయె
అడుగడుగునా అణచివేతాయె
పెదవి విప్పితే లాఠీ నాట్యమాడె

గిరిగూడేలు చూసినా
ఏమున్నది గర్వకారణం
గొంతు తడుపుదామన్నా
గుక్కెడునీరు గగనమాయె
దారీతెన్నూ లేదాయె
బతుకంతా డోలీపాలాయె
ఆకాశాన ధరలాయె
దించేవారే లేరాయె
డొక్క నింపుదామంటె
గుప్పెడన్నం దొరకదాయె
మత్తు మందు ఫుల్లాయె
మంచినీరు నిల్లాయె
దగాకోరుల దోపిడీ
అడ్డుకునేవారే లేరాయె
నిలువరిద్దామంటే
ప్రభుత్వాలు కూలిపోయె
పాలకులు మారరాయె
భరతమాత కంటనీరు
జలపాతమాయె!
గోల్కొండ బాబూరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img