Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

జాతీయగీతం 1857

ఉర్దూ రచన: మౌల్వి లియాఖత్‌ అలీ
తెలుగు అనువాదం:: దివి కుమార్‌
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం పవిత్రమైనది మా దేశం
స్వర్గం కంటే మహాప్రియం
సమస్త సంపద మాదేలే
హిందుస్థాను మనదేలే!!
హిందుస్థాను మనదేశం
దీనికి మనమే వారసులం!
దీని వైభవం దీని ప్రాభవం
వెలుగులు చిమ్మును జగమంతా అతి ప్రాచీనం
ఎంతో ధాటి
దీనికి లేదుర
ఇలలో సాటి!!
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!

గంగా యమునలు పారు నిండుగా
మా నేలల్లో బంగారు పండగ
దిగువున పరుచుకు మైదానాలు
దిగ్గున ఎగసే సంద్రపుటలలు
మంచు నిండినా ఎత్తు కొండలు
కావలి దండిగ మాకు అండగా
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!
దూరం నుండి వచ్చిన దుష్టులు చేసిరి
కంతిరి మాయ చేష్టలు
ప్రియాతి ప్రియమవు దేశాన్నంత దోచివేసిరి రెండుచేతులా!!
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!
అమరవీరులు విసిరిన సవాలు దేశవాసులు వినరండి
బానిస సంకెలు తెంచండి
నిప్పుల వానై కురవండి !!
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!
హిందూ ముస్లిం సిక్కులందరం
ప్రియాతి ప్రియమవు సోదరులం
అదిగదిగో మన స్వతంత్ర జెండా
చేస్తాం సలాము గుండెల నిండా!!
చేస్తాం సలాము గుండెల నిండా!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img