Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

దినం


దినం అంటే దినం కాదు
మునుపొకసారి
పరితపించిన 
జ్ఞాపకం.
    దినాల్ని
    విత్తినవాళ్లకు
    గుర్తొస్తాయి.
గుడ్డివాని 
ఊతకర్రకు 
చూపైనవాని
పాదాలలో
దిగటానికి కాచుకున్న ముళ్లను 
కాలం ఏరేస్తుంది.
    ఏదో ఒక మెతుకు
    ఎవరికోసమో అందేలా
    చేసేవాడు
    పక్షుల కలలో కొచ్చే
    మహారాజు.
వీధిలో నిలబడి
గొంతు తడుపుకునేందుకిచ్చే 
గొంతులా కాదు
అలా కనిపించేవాళ్లకు
ఇచ్చే ఒక గ్లాసుడు నీళ్లు
అది చాలును ఆ రోజుటికి.
    దినాలలో 
    దాచుకున్నవన్నీ
    ఒక దినం
    మనల్ని చూడాలని ఇష్టపడే
    దినం అది ఏదైనప్పటికీ. 

తమిళం: జాతీయ పురస్కార
సినీ దర్శకులు, కవి- శీను రామసామి
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ ,
73820 08979

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img