Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

పౌరులే వీరులైతే

పోరాట గీతం:
కదలిరండి పౌరులార! కదనానికి వీరులార!
మదమెక్కిన కీచకులను
పీచమణచ కలిసిరండిఆంధ్రులారా! పదవులనే కొమ్ములతో - కోరలతో చెలరేగే దురహంకారుల ఆగడాల అరికట్టగ కదలిరండిమేధావులారా!
స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు – బిగుస్తున్న ఉరిత్రాళ్లను
ఛేదించగ కొడవలెత్తి
కదనుత్రొక్కి కదలిరండి-యువకులారా!
ప్రజాస్వామ్య వృక్షాన్నే
అధికారం గునపంతో – పెకలించే నియంతలను
పెకలించగ ఆయుధమై తరలిరండి తరుణులార!
ప్రతిఒక్కరు కెరటమై
ప్రజలంతా ఉప్పెనలా
దుర్మార్గపు పాలకులను
ముంచివేయ కడలిలాగ కలిసిరండి కర్షకులారా!
సమభావం స్వాతంత్య్రం – సౌహార్ద్రం సౌభ్రాత్రం
జెండాలను నలుమూలల
ఎగరేయగ ఆంధ్రావనిలో కలిసిరండి కార్మికులారా!
డాక్టర్‌ లగడపాటి సంగయ్య, 9490769242.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img