Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

బాలల్ని అలరించే నాటికలు ‘రెండు చేతులు’

సమాజంలో మార్పు తేవాలి అంటే, సామాన్య జనానికి అర్థం అయ్యే విధంగా ఏదో ఒక పద్యం, పాట, నృత్యం లేదా నాటకం ద్వారా సమాజాన్ని, సమాజంలోని ప్రజలను చైతన్యవంతం చేయవచ్చు అని చెప్పవచ్చు. ఇలా సమాజాన్ని చైతన్యపరిచిన నాటకాలు, కథలు, పాటలు, పద్యాలు ఎన్నో చూసాం, విన్నాం. అలాగే నేడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ నేర్పాలంటే వారికి మంచి కథలు చెబుతున్నాం.వాటిని మంచి నాటక రూపంలో తీసుకు వచ్చిన రచయిత వల్లూరు శివప్రసాద్‌. ఈ నాటక రచయితగా బంగారు నంది వంటి వాటిని ఎన్నో పాందారు. వారి కలం నుండి వచ్చిన నాటిక రెండు చేతులు.
ఈ పుస్తకంలో మొత్తం 6 నాటికలున్నాయి. ఆరు నాటికలు విభిన్న అంశాలకు సంబంధించి సమాజంలో జరిగే చెడుపై ఎలా పోరాడాలి అన్న ధైర్యాన్ని పిల్లలకు కల్గించేవి ఈ నాటకాలు. ఈ నాటికలన్ని చదవదగినవే. ఇవి నాటక రూపంలో చూస్తే అద్భుతంగా ఉంటాయి. వీటిలో క్షమ అనే నాటకంలో తన కొడుక్కి తాను తెలియక చేసిన తప్పు వల్ల జీవితాంతం అంగవైకల్యం కల్గటం కొడుకు, తండ్రిని కారణం ప్రశ్నిస్తే చెప్పలేక కుంగిపోవటం జీవితాంతం బాధపడటం ఈ క్షమ నాటక సారాంశం. ఇది చదివితేనే బాధ కల్గుతుంటే, నాటక రూపంలో చూస్తే హృదయం కరుగుతుంది. మరో నాటిక స్నేహ మాధురి. ఈ నాటకంలో గూడ ఇద్దరు స్నేహితురాళ్ల స్నేహ బంధం గురించి తెలిపేది. ఇద్దరు మతాలు వేరైన బంధాలు గొప్పవని తెలిపే నాటకం. చివరిలో స్నేహితురాలికి అనారోగ్యం వల్ల జుట్టు రాలిపోవటంతో స్నేహితురాలి కోసం తాను గుండు కొట్టించుకొని బడికి వెళ్లటానికి సిద్ధం అయిన స్నేహ బంధం తెలిపే నాటకం చూడవలసిందే. మరొక నాటిక చదువు నొప్పులు నాటికలో మన ఇళ్లలో పిల్లలు గూడ స్కూలుకి వెళ్లమంటే ఎలా బడి మానేద్దామా అంటూ చెప్పే కారణాలతో సాగే నాటకం చదువు నొప్పులు. మూఢ నమ్మకాల మీద గడియారం నాటిక కూడ నేటి సమాజ పరిస్థితి అద్దం పడుతుంది. ప్రకృతికి సంబంధించి రెండు చేతులు నాటకం సాగుతుంది. ఏది ఏమైనా నాటకం, నాటకాలు మనిషిలో గొప్ప మార్పును తేగలవు. అటువంటి నాటికలు రెండు చేతులు అని చెప్పవచ్చు.
విష్ణుభొట్ల రామకృష్ణ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img