Friday, March 31, 2023
Friday, March 31, 2023

మోదీ పాలన మూల్యం

బీజేపీ అగ్రనాయకుడు అతల్‌ బిహారీ వాజపేయి మొట్టమొదటి సారి 1996 మేలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మనగలుగుతుందన్న భ్రమ ఎవరికీ లేదు. 1998 మార్చిలో ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయినా సంఫ్‌ుపరివార్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. ఆ తరవాత ఆయన అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసినప్పుడు మాత్రం సంఫ్‌ుపరివార్‌ ఎజెండా అమలు చేయడానికి నర్మగర్భంగా మాత్రమే ప్రయత్నం జరిగింది.
నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తరవాత హిందుత్వ సిద్ధాంత వ్యాప్తి దేశమంతటా అమలు చేస్తున్న ఛాయలు కనిపించాయి. 2019లో మోదీ మరింత మెజారిటీ సాధించిన తరవాత సంఫ్‌ుపరివార్‌ ఎజెండా అమలు చేయడం జోరెక్కింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా ఎలా అమలు చేయాలో వాజపేయికి అంతగా అర్థమైనట్టు లేదు. ఉన్న పరిమితులలో ఆయన కొంత ప్రయత్నం చేశారు. పైగా బీజేపీ చుట్టూ జనసమీకరణ సాధించింది అడ్వాణీ తప్ప వాజపేయి కాదు.
మోదీ జాతీయస్థాయిలో నాయకత్వం చేపట్టిన తరవాత బీజేపీకి, ఆర్‌ఎస్‌ ఎస్‌కు మధ్య బంధం మూలాల నుంచి బలపడిరది. అడ్వాణీ బాబ్రీ ఉద్యమం సెక్యులర్‌ భావాలున్న హిందువులలో కూడా తాము హిందువులమన్న చైతన్యం పెంపొందించడానికి దోహదం చేసింది. మోదీ ఏలుబడిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో బంధం ఎంత గట్టిపడినా హిందుత్వం సర్వవ్యాప్తం కావడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ మోదీ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఒకప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ను మతతత్వ సంస్థగా భావించే వారు. ఇప్పుడు ఆ మతతత్వమే చెలామణిలో ఉంది. సెక్యులర్‌ అన్న మాటను అడ్వాణీ ఎద్దేవా చేసినంతగా ఎవరూ చేయలేదు. ఆయన తన పాండిత్యాన్ని అంతా ఉపయోగించి ‘‘సిక్యులర్‌’’ (రుజాగ్రస్థ) అన్న మాట ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు మోదీ దూకుడుగా అమలు చేస్తున్న హిందుత్వే సెక్యులర్‌ అని నమ్మే పరిస్థితికి చేరుకున్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తుతం మోదీని ఆదేశించే స్థితిలో లేదు. మోదీ చేసిన ప్రతిపనికి ఆమోదముద్ర వేయడం, దాన్నే ప్రచారంలో పెట్టడం ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ బాధ్యత అయింది.
మోదీ ఏలుబడిలో దేశంలో స్థితిగతులు ఏమిటో వివరించడానికి ఆకార్‌ పటేల్‌ 488 పేజీలలో ‘ప్రైస్‌ ఆఫ్‌ ది మోదీ ఇయర్స్‌’’ రాశారు. 2021లో ఇది వెలువడిరది. విస్తృతంగా చర్చలోకి వచ్చింది. రచయిత, వృత్తిరీత్యా పత్రికా రచయిత అయిన ఆకార్‌ పటేల్‌ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తారు. మోదీ పరిపాలనను అంచనా వేయడానికి ఆయన కేవలం రాజకీయ వ్యాఖ్యానాలకే పరిమితం కాలేదు. ప్రతి విషయాన్ని సోపపత్తికంగా నిరూపించడానికి అవసరమైన గణాంకాలు, వాస్తవాలు, సమాచారం అందజేశారు. వివిధ రంగాలకు సంబంధించి భిన్న దేశాల స్థితి ఏమిటో అంచనా వేయడానికి అంతర్జాతీయ వ్యవస్థలు పనిచేస్తాయి. ఇవన్నీ మనదేశం ఏ రంగంలో ఏ స్థానంలో ఉందో విడమరుస్తుంది. దాదాపు అన్ని రంగాలలో మోదీ ప్రభుత్వం అడుగునుంచి అగ్రస్థానంలో ఉన్న వైనాన్ని ఆకార్‌ పటేల్‌ అందించిన సమాచారాన్ని చూస్తే అర్థం అవుతుంది.
మొదట భారతీయ జనసంఫ్‌ును, ఆ తరవాత దాని మలి రూపమైన బీజేపీని నిలబెట్టడానికి, జన సమీకరణకు వాజపేయి, అడ్వాణీ దశాబ్దాల తరబడి పాటుపడాల్సి వచ్చింది. అయితే ఆ ఇద్దరు నేతలూ జన సమీకరణకు, పార్టీ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తే మోదీ పార్టీ శ్రేణులకే పరిమితం కాకుండా సామాన్య జనానికి హిందుత్వ భావజాలం నూరిపోయడంలో సఫలమయ్యారు. దీనికోసం ఆయన విలోమ పద్ధతి ఎంచుకున్నారు. హిందువులు సమైక్యం కావలసిన అవసరం గురించి మహోపన్యాసాలు చేయలేదు. ముస్లింల మీద విద్వేషం పెరిగేట్టు చేసి, హిందువులు ప్రమాదంలో ఉన్నారని నమ్మించి… హిందువుల సమీకరణ సునాయాసంగా సాధించారు. ఇందులోనూ ఆయన నోరు విప్పి చేసినదానికన్నా గుప్పెట్లో ఉన్న ప్రభుత్వాధికారాన్ని వినియోగించు కుని సాధించిందే ఎక్కువ. ముస్లింలను నస్మరంతిగాళ్లను చేయడంలో మోదీ కౌటిల్యం అసామాన్యమైంది. కరడుగట్టిన మితవాదాన్ని తీవ్రరూపంలో అమలు చేయడంలో మోదీకి సాటి ఎవరూ లేరు.
ఆ క్రమంలో ఆయన బీజేపీ మీదో, ఆర్‌ఎస్‌ఎస్‌ మీదో ఆధారపడ్డదానికన్నా తన వ్యక్తిత్వాన్ని, పలుకుబడిని, తనమీద వ్యక్తి ఆరాధనా తత్వాన్ని పెంపొందించి తానే ఒక విరాట్రూపంగా తయారయ్యారు. అందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు మోదీకి అనుషంగాలుగా మిగిలిపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మొదట మోదీకి విశ్వాసపాత్రంగా మెలుగుతారు. ఆ తరవాతే మోహన్‌ భగవత్‌ సంగతి. అడ్వాణీ లాంటి యోధానుయోధులనే ఎందుకూ కొరగాకుండా పక్కకు నెట్టేసిన మోదీ హిందుత్వవాదులను ఏకోశ్వరోపాసకులుగా మార్చేశారు. సంఫ్‌ు పరివార్‌కు నిజానికి విగ్రహారాధనలో విశ్వాసం ఉండదు. రామజన్మ భూమి ఉద్యమం ద్వారా అడ్వాణీ ఆ భావనను పాదుకొల్పితే మోదీ బీజేపీ మొత్తాన్నే కాదు, బీజేపీలాగే ఆలోచించే మధ్య తరగతి జీవులందరినీ భక్తులుగా మార్చేశారు. ఒకవేపున మోదీ, మరోవేపున మోదీ భక్తులు. అంతే.
సెక్యులరిజం అన్న మాటను మోదీ ఎంతగా అప్రతిష్ట పాలు చేశారంటే ఇప్పుడు కరడుగట్టిన సెక్యులర్‌ పార్టీలు సైతం ఆ మాట ఉచ్చరించడానికే జంకుతున్నాయి. సెక్యులరిజం, రాజ్యాంగ మౌలిక స్వరూపం లాంటి మాటలు ఇప్పుడు ఇంకా ఇంగువ గుడ్డ వాసన వదలని న్యాయస్థానాల్లో మాత్రమే అరుదుగా వినిపిస్తాయి. మిగతా చోట్ల అవి అపశబ్దాలే.
మోదీ సర్వాంతర్యామి అయిపోయాడు గనక ఆయన పరిపాలన ఎలా ఉంది, ఎలా ఉంటుంది అని చర్చించడమే ఈ గ్రంథంలో ఆకార్‌ పటేల్‌ చేసిన పని. వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించడానికి మోదీ ఏ మాత్రం బిడియ పడరు. ‘మోదీ హై తో ముంకిన్‌ హై (మోదీ ఉంటే సాధ్యమే)’ లాంటి మాటలు చెప్పడానికి ఎంత ఆత్మ నిబ్బరం ఉండాలి! ముఖాముఖి సంభాషణల్లోనూ మోదీ తనను తాను మోదీ అని ప్రథమ పురుషే ప్రయోగిస్తారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన తరవాత ఓ బ్రిటిష్‌ జర్నలిస్టుతో మాట్లాడుతూ ‘ఇది ఇరవై ఒకటవ శతాబ్దం. ఇది నూతన భారతం. మేం ఎన్నికల్లో గెలిచిన తరవాత ‘‘మోదీ, మోదీ, మోదీ’’ నినాదాలు మిన్నం టాయి. ఇది మోదీ విజయం కాదు. నేటి విజయం మోదీ విజయం ఏమీ కాదు. ఈ విజయం దేశ ప్రజలందరి ఆకాంక్షల విజయం. నిజాయతీ కోసం అంగలా రుస్తున్న వారి గెలుపు’’ అని అన్నారు. ఈ మాట్ల్లో బోలెడు వినయం కనిపి స్తోంది. కొంచెం తెరతీసి చూస్తే కనిపించేది… అంతా అహంకార ధోరణే. మరొక సందర్భంలో మోదీ ఏమన్నారో వింటే ఆయన అహంభావం ఎంత లోతైందో అర్థం అవుతుంది. ‘నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిని అయిన తరవాత మూడు నాలుగు రోజులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ఫైళ్ల గుట్ట నా టేబులు మీద పెట్టించారు. నేను వాటి వంకే చూడలేదు. నేను ఇవన్నీ చదవ లేను. వీటిల్లో ఉన్న విషయం ఏమిటో చెప్పండి. ఇవన్నీ చదవడం మొదలు పెడ్తే దానికి అంతే ఉండదు. ఫైళ్లు చదవడం నా స్వభావం కాదు. ఈ ఫైళ్లల్లో ఏముందో చెప్పండి చాలు’’ అన్నాను అంటారు మోదీ. ‘‘ఒక్కసారి వింటే చాలు నాకు గుర్తుండి పోతుంది. చిన్న చిన్న వివరాలు కూడా గుర్తుంటాయి. నేను అధికారులతో వాదించను. అయితే వారు చెప్పేది జాగ్రత్తగా వింటాను. విన్న దాన్ని విశ్లేషించు కుంటాను. వర్గీకరిస్తాను. మదిలో ఏ డబ్బాలో ఏముండాలో తేల్చుకుంటాను. దీనికి నాకు అట్టే సమయం పట్టదు. పది పేజీల పత్రాన్ని అర్థం చేసుకోవడానికి నాకు రెండు నిముషాలు చాలు. ఈ నేర్పు నాకు అలవడిరది’’ అంటారు మోదీ. ఈ మాటల్లో ఆత్మవిశ్వాసం కన్నా అహంభావ ఛాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదూ. ఈ పొరలను తొలగించడమే ఆకార్‌ పటేల్‌ చేసిన పని.

  • ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img