Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

వజ్రోత్సవ స్వాతంత్య్రం…!

పసిడి సిరులు కురిపించే నాదేశం
స్వాతంత్య్ర వజ్రోత్సవాలా వేళ…
మృదు లతల సోయగాలు ఎక్కడ
హిమశికర పాలవెన్నెల కాంతులేవి
కోహినూర్‌ వజ్రం వంటి నా దేశంలో
సకల కళా సాంస్కృతక వైభవం ఏది
పుణ్యభూమిలో ప్రగతి దారులెక్కడ
విశ్వ శిఖరంపై త్రివర్ణ పతాకం స్థానం
దిగంబర రహస్యమై ఏమూలనుందో
త్యాగాల సమాధులపై కడుతున్న
సామ్రాజ్యాలు నిండా శవాల కంపే
అత్తెసరు బతుకులన్ని అత్తరు పూసి
కాలం వెళ్లదీస్తుంటే…! ఉన్నోళ్ళంతా
పన్నీరు పూసుకుని పల్లకిలో షికార్లు
ఇప్పుడు పాలకులు పాలికాపులై
దొరగారి పల్లకిమోస్తుంటే… నా దేశ
జాతీయ జెండా పళ్లకీపై మొడో రింది
స్వాతంత్య్రం…వజ్రోత్సవాలు వేళ
అత్తెసరుబతుకులు… ఒక్కొక్కటి ముడేసి….మోకులవ్వాలి ….
భస్మాసుర పాలన పై సూలమవ్వాలి
రెడ్డి శంకరరావు, 9494333511

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img