Friday, August 12, 2022
Friday, August 12, 2022

సామాజిక చైతన్య దీప్తి వేమన కవిత్వం

డా॥ తక్కోలు మాచిరెడ్డి, సెల్‌: 9666626546

ప్రముఖ విద్వాంసుడు, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి తన ‘కవిత్వ తత్వ విచారము’ లో వేమనను గురించి రాస్తూ ఇలా అన్నాడు. ‘‘వేమనకు పుస్తక జ్ఞానం ఇంచుమించు సున్న/ వ్యాకరణము, ఛందస్సు, అలంకార శాస్త్రము మొదలగు వానిలో ఆసక్తి ఎంత తక్కువో, భక్తియు నంత తక్కువ/ అట్లుండినను వేమన మహాకవులలో జేరిన వాడని చెప్పుటకయి, సామాన్య మయిన శుష్క పండితులు తప్ప, ఇంకెవరును సందియపడరు’’.
వేమన పద్యాలను సేకరించడంలోను, వివిధ భాషల్లోకి అనువాదం చేయడంలోను, పాశ్చాత్యుల కృషి ప్రశంసనీయం. తాళపత్ర గ్రంథాలలోని వేమన పద్యాలను సేకరించి ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించిన ప్రముఖుల్లో మొదటివాడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 1829 లో 693 వేమన పద్యాలను ఇంగ్లీషు అనువాదంతో సహా ప్రచురించినాడు. 1839 లో ఈయనే మరికొన్నిపద్యాలను చేర్చి 1200పద్యాలను ద్వితీయముద్రణలో ప్రచురించాడు. ఫ్రెంచి మత గురువు దూబాయ్‌, దేవిడ్‌ బార్‌నెట్‌, గ్రియర్సన్‌ కొన్ని వేమన పద్యాలను ఫ్రెంచి, లాటిన్‌భాషల్లోకి అనువాదం చేశారు. వేమన అంతర్జాతీయ వాది, మానవతావాది. కులాన్ని నిరసిస్తారు. వేమన పంక్తుల్లోఉర్వి వారికెల్ల నొక్క కంచము బెట్టి/ పొత్తు గుడిపి కులము బొలయజేసి తలను చేయిపెట్టి తగనమ్మ జెప్పరా/ విశ్వదాభిరామ వినురవేమ! ప్రపంచ ప్రజలందరినీ ఒకచోట చేర్చి, ఒక కంచముబెట్టి కులభేదం లేకుండా ప్రమాణం చేయించండని ఉద్బోధిస్తాడు వేమన. ఇంత విశాల దృక్పథంకలిగిన వేమన సామాజిక దురాచారాల్ని, చైతన్యవంతంగా నిరసిస్తాడు/ తీర్థస్థానాల్లో తల గొరిగించుకునే వారి మీద చురకవేస్తూ వేమన అంటాడు: సకల తీర్థములను సకల యజ్ఞంబుల/ తలలు గొరిగించుకున్న ఫలము గలదె/ మంత్ర జలము కంటే మంగలి జలమెచ్చు..విశ్వదాభిరామ వినురవేమ! కుల వ్యవస్థ కూలి పోవాలని వేమన అన్ని కులాలు సమానం అని అంటాడు. కుల వ్యవస్థ సృష్టించే దొంతరల సమాజ వ్యవస్థను ఈసడిరచుకుంటాడు. రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్‌ కులాల ఔన్నత్యాన్ని విశదీకరిస్తాడు వేమన ఇలా మాదిగ అనగానే మరి తక్కువందురు/ మాదిగ యిలసురల మాకు గాదె/ మాదిగకును బిడ్డ మన యరుంధతి గాదెవిశ్వదాభిరామ! వినురవేమ/ ఇల సురలు అంటే బ్రాహ్మణులు సప్త ఋషులలో ఒకడైన వశిష్ఠుని భార్యే గదా మన సతీ అరుంధతి అని అంటారు సగర్వంగా ఆ కులం వారు. సర్వ జనులూ సమానమే అనే వేమన కులం ఆధారంగా ఎవరినీ నిందించకూడదని ఉపదేశిస్తాడు ఇలా మాలవాని నేల మహిమీద నిందింప? ఒడల రక్త మాంస మొకటి కాదె, వానిలోన వెలుగు వాని కులంబేది? అని ప్రశ్న సంధిస్తాడు వేమన. కర్మచేత మాలలౌతారు గాని, జన్మ చేత కాదు అంటాడు ఆయన. అంటరానితనాన్ని నిరసిస్తాడు దాన్ని పాటించే వారిని నర పశువులు అంటాడు మాలయటంచున మఱి నీళ్ల మునిగిరి మా కర్మచేత మాలడాయె/ నేల తెలియరో యీ నర పశువులు?
మనిషే దైవం అని ఒక పద్యంలో ప్రకటిస్తాడు వేమన. ఆత్మయందె తలపు ననువుగా నొనరించి/ నిశ్చలముగ దృష్టి నిలిపెనేని/ అతడు నీవే సుమ్మి అనుమానమేలరా? అంటే, ఆత్మను కేంద్రంచేసుకొని దానిపై నిశ్చలమైన దృషి ్టనిలుపుకొని, మెసలు వాడు దైవమే సుమానిస్సందేహంగా దైవమే/ మాయావాదాన్ని, మిథ్యావాదాన్ని కొట్టి పారేస్తాడు వేమన మాయ జగమంచు మనుజులు సెప్పిరి/ మాయగాదు కర్మమయముగాని/ మాయ jైున జగము మఱి యేడ నున్నచోవిశ్వదాభిరామ! వినురవేమ! ‘బయలు’ అనే ఓ మామూలు పదాన్ని విశేషమైన సందర్భంలో వాడుతాడు/ బయలు అంటే, విశ్వం, అంతరిక్షం అని భావించవచ్చునేమో అన్పిస్తుంది/ ఠాగూరు లాగే, బయలున బంధము పుట్టును, పరమాత్మకును బంధము కలుగును అంటాడు వేమన/ ఠాగూర్‌లాగే తనలోనే బ్రహ్మం అంటాడు వేమన. విశ్వమందు బ్రహ్మ విస్తరించుట గాక/ వారె బ్రహ్మమనుచు వెదకనేల? తగిలి యుండుగాదె తనలోన బ్రహ్మంచు/ బయలులోనే సమస్తమూ అంటూ బయలందె పుట్టును సర్వము / బయలందే లీనమగును బ్రహ్మండంచుల్‌/ బయలని మదిలో తెలిసిన/ బయలదే ముక్తి బట్టబయలగు వేమా! పగలు, రేయి మఱిచి, జ్ఞానసుధా ప్రవాహములో తేలియోలలాడుచూ, అతను, నేను వేరనే సంగతి మరచిన వాడే ఉత్తమ యోగి అంటాడు వేమన/ పగలు రేయి మఱచి! భావంబు మరచియు/ తాను నేనని యెది తలపు మరిచి/ యుండు వాని నుంచ! ఉత్తమ యోగిరా! కుల వాదాన్నీ కాదు, వేమన మతాలను కూడా లెక్కచేయడుమతాల వలన గుందరగోళం ఏర్పడుతుందని వాటిని నిరసిస్తాడు. ఇలామర్మ మెరుగలేక మతములగల్పించి/ యుర్విజనులు దుఃఖ మొందుచుండ్రు/ గాజుటింటి కుక్క కళవళపడురీతి/ కుక్క అద్దాల యింటిలో తన ప్రతిబింబము చూచి భ్రమించి మరియొక కుక్క వచ్చిందని కళవెళపడు తుంది/ ‘మర్మం’ తెలుసుకోకుండా అనేక మతాలు వెలసినాయి అని భావన/
నరుడు పుట్టేపుడు ఏమీ తేడు, చచ్చేప్పుడు ఏమీ తీసుకుపోడుభౌతిక సంపత్తి తన వెంట రాదు/ ధనము ఎందుకూ పనికి రాదు/ వేమన మాటల్లో ఏమి గొంచు వచ్చెనేమి తా గొని పోవు/ పుట్టు వేళ నరుడు గిట్టువేళ? ధనము లెచటికేగు? తానేగు నెచటికి? కొన్ని మానసిక ధోరణులను ముఖ్యంగా కోపములాంటి వాటి చేత కలుగు హానిని విశదీకరిస్తు వేమనఅతి సరళమైన భాషలో కోపమునను ఘనత కొంచెమైపోవును /కోపమునను గుణము కొఱత పడును/ కోపమునను బతుకు కొంచెమై పోవును శత్రువును కూడా చంప కూడదు, వీలైతే తగిన మేలు చేయాలి అతనికి అని వేమన అభిమతం/ ఆయన మాటల్లోచంపదగిన యట్టి శత్రువు తనచేత/ చిక్కెనేని కీడు సేయరాదు/ పొసగ మేలుచేసి పొమ్మనుటె మేలు ఒక మంచి ఉపమానంతో ఇల్లాలిని వదిలి వేరే స్త్రీతో సంబంధం పెట్టుకునే వారి మీద, వేమన వేసిన చురక చూడండిఇంటి యాలి విడిచి యిలఁ జారకాంతల/ వెంట తిరుగు వాడు వెర్రివాడు/ పంటచేను విడిచి పరిగ నేరిన యట్లు/ పంటచేనులోని పంటను వదలి, రాలిన పరిగను ఏరినట్లుంది పురుషుని ఈ వాలకం అని అంటాడు. వేమన దాదాపు ప్రతి పద్యంలోనూ ఒక ఉపమానం ఉంటుంది/ ఎర్రగడ్డల తోటలో మల్లిమొక్క తన సువాసనను కోల్పోయినట్లే/ దుర్జన సాంగత్యం చేసిన సజ్జనుడు నీతి కోల్పోతాడు/ వేమన మాటల్లో టక్కరులను గూడి యెకసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును/ ఉల్లి తోటం బెరుగు మల్లిమొక్క కరణి/ అలాగే మరో ఉపమాలంకారం చూడండిప్రసిద్ధ పద్యంలో అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/ సజ్జనుండు బల్కు చల్లగాను/ కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? వేమన రైతు కుటుంబంలో పుట్టినాడు. అతని కవితలో వ్యవసాయ సంబంధమైన ఉపమానాలు మెండు. ఒక్క చెఱకు గడయందు వెన్ను పుట్టితే, చెరకు గడ కంతయు తీపి తగ్గునని తోటనంతా కొట్టి వేస్తాడు. సమాజంలో ఒక గుణహీనుడుంటే, అది ఆ సమాజమంతటికీ చెరుపే. ఆయన మాటల్లోనే కులములోన నొకడు గుణ హీనుడుండెనా/ కులము చెడును వాని గుణము వలన / వెలయు చెఱకునందు వెన్నుపుట్టిన రీతి/ ఆత్మజ్ఞానమే బ్రహ్మ జ్ఞాన మంటూవేమన బ్రహ్మమనగ వేరె పర దేశంబున లేడు/ బ్రహ్మ మనగ తాను బట్టబయలు/ తన్ను తానెరిగిన తానెపోబ్రహ్మంబు/ ఈ పద్యం వేమన విశ్వవిద్యాలయం నీతి వాక్యమై పలువురి మనసులను స్పృశిస్తోందిఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వేమన తనకు రావలసినంత పేరు సంపాదించు కోని మహాకవి అంటూ వేమనను గురించి అన్నాడు. అప్పుడేమో గాని, ఇపుడు ఆయనపేరుతో కడపలో ఓ విశ్వవిద్యాలయమే వెలసిఉంది. వేమనపై పరిశోధించిన వారిలో ప్రముఖులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, చిలుకూరి వీరభద్రరావు, వేటూరు ప్రభాకరశాస్త్రి, డా॥గోపి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వేమనపై శర్మగారి ఉపన్యాసాలు ప్రసిద్ధం. ఇకపోతే వేమన పద్యాల సంఖ్యనికరంగా తేలినవి 12001500 మధ్య వేమన కూర్చొని రాసిన పద్యాలు తక్కువఎక్కువ భాగం ఆశువుగా చెప్పినవే అవి విన్నవారు రాసిపెట్టినవి కొన్ని కాగా, కంఠస్తం చేసిన వారు మరికొందరు అందుకే ఎన్నో పాఠాంతరాలు/ వేమనవే మరికొన్ని పద్యాలు చూద్దాం.
కసవు తినును గాదె పసరంబులెపుడు/ చెప్పినట్లు వినుచు చేయు పనులు/ వాని సాటిjైున మానవుడొప్పడా? జ్ఞానము లేక, గడ్డి తినెడి పశువు చెప్పినట్లు వినుచు పనులు చేయును/ జ్ఞానము గల మానవుడు ఆ పశువు పాటిjైునను చేయవలదా? మూర్ఖులు ఈ పశువుల కన్నా బుద్ధి తక్కువగా ప్రవర్తింతురు/ ఎవరు చెప్పినా వినరు/ మరో ఉపమానంతో మూర్ఖుల కెంత హితబోధ చేసినా ఫలితముండదు/ పొట్లకాయకు రాయి ముడివేసి తాడుతో కట్టినచో అది వంకర లేకుండా అందంగా చక్కగా పెరుగుతుంది. కాని కుక్క తోకకు బద్దలు వేసి కట్టినా వంకర లేకుండా పోదు. మూర్ఖులెంత చెప్పినా బాగుపడరు. వేమన పంక్తులుపొట్లకాయ రాయి పొదిగి త్రాటను గట్టి/ లీలతోడ వంకలేక మెఱుగు/ కుక్కతోక కట్ట చక్కగా వచ్చునా? ధనార్జన కోసం తిరిగితే మోక్షం రాదు అంటూ కాసులకును తిరుగ కలుగునా మోక్షంబు అని అవహేళన చేస్తాడు. ధన స్వామ్యాన్ని నిరసిస్తూ కులము గలవారు, గోత్రము గలవారు విద్య చేత విర్రవీగువారు/ పసిడి గల్గువాని బానిస కొడుకులు అంటూ మరియు, పుత్తడి గలవాని పుండు బాధయు కూడా వార్తకెక్కు/ పేదవాని యింట పెండ్లైన యెవ్వరికీ తెలియదు/ కులం కాదు, గుణమే ప్రధానమంటూ వేమన రామనామ పఠనచే మహి వాల్మీకి/ పాపి బోయడయ్యు బాపడయ్యె/కలుము ఘనము కాదు గుణమే ప్రధానము/
వ్రతములు పాటించినంత మాత్రం చేత దుర్గుణాలు పోవని ఒక పద్యంలో బలంగా చెబుతాడు ఓ ఉపమానంతోదశమి యేకాదశియని వ్రతముల బూని/ మెతుకు తినకున్న దుర్గుణమది యడంగునె? పుట్టపై గొట్ట ఉరగంచు గిట్టబోదు/ తీరెఱుంగని మౌఢ్యమీ తెఱగ వేమ! పామును గుర్తించక పుట్టమీద కొట్టినంత మాత్రమున పాము చావదు/ అట్లే దుర్గుణముల నణచవలెనని దశమి, యేకాదశి అనే వ్రతముల బూని అన్నము తినకున్నంత మాత్రమున దుర్గుణములు తగ్గవు/ తగ్గునని అనుకోవడం అవగాహన లేని మూర్ఖత్వాలు. అవగాహన పెంచుకోవాలే గాని ఉపవాస వ్రతములు ఆచరించినంత మాత్రమున దుర్గుణాలు పోవు అని వేమన ఉపదేశం. ఇలా నలుదెసలా సామాజిక చైతన్య దీప్తి ప్రసరింపజేసిన మహనీయుడు వేమన. ప్రఖ్యాత బాంగ్లా రచయిత బినయ్‌ కుమార్‌ సర్కార్‌ ప్రకారం తమిళ కవి తిరువళ్లువర్‌ రాసిన తిరుక్కురళ్‌ (సూక్తులు)నందలి భక్తి పారవశ్యము, సమతా భావములను విప్లవ సీమా పరిసరములకు కొనిపోయినాడు వేమన. ఇది సత్యం. ఇక, ఒకమాట మకుటం గురించి విశ్వదాభిరామ వినురవేమ అంటే, విశ్వ సమస్తమును, దఇచ్చుటతో అభిరాముడు మనోజ్ఞమైనవాడు వేమన అని అర్థం. ఆఁ, అసలు విషయమేమిటంటే, వేమన కులాన్ని నిరసించినా, అతను పుట్టింది కాపుకులంలో అంటే రెడ్లకులంలో రాయలసీమలో పుట్టి పెరిగాడు, తిరిగాడు. వేమన 17వ శతాబ్దంవాడని విద్వాంసులు, పరి శోధకులు తేల్చారు. కటారుపల్లెలో వేమన సమాధి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img