Friday, April 19, 2024
Friday, April 19, 2024

కథక చక్రవర్తి పాలగుమ్మి పద్మరాజు

గెల్లి రామమోహనరావు
ఫోన్‌: 0863 2357514

పాలగుమ్మి పద్మరాజు 2461915 వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురంలో జన్మించారు. ప్రాధమిక హైస్కూలు విద్య పూర్తయ్యింది. కళాశాలలో బి.ఏ వరకు చదివారు. ఉద్యోగా న్వేషణలో అధ్యాపకులుగా పనిచేశారు. జీవితంలో ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ సినీ రచన చేశారు. సినీరంగంలో ఉన్నప్పుడే కథారచన చేయటం ప్రారంభించారు. ‘గాలివాన’ కథా సంపుటిని ప్రచురించారు. 1944 లో పేదరైతు అనే దీర్ఘ కవితను అల్లారు. బికారి రాముడు, పాపం పండిరది అనే నాటకాలు రాశారు. నల్లరేగడి, రెండవ అశోకుని మూణ్ణాల పాలన, రామరాజ్యానికి రహదారి, చచ్చిపోయిన మనిషి, చచ్చి సాధించాడు అపరాధ పరిశోధక నవలిది. ‘ఇతని పక్కనున్నప్పుడు చిన్నవాడుగా నాకు నేనే కనిపిస్తాను’ అని కృష్ణశాస్త్రి పద్మరాజును ప్రశంసించారు.
పాలగుమ్మి వారికప్పటికి పద్నాలుగేండ్ల వయసు. ఆయన శతావధాని. చెళ్లపిళ్ల వారిని కలిసి వినయ విధేయతలు చూపిస్తూ ‘‘ఆర్యా శాస్త్రిగారూ నా పేరు పాలగుమ్మి పద్మరాజు. నేనొక పద్యం రాశాను. ఆ పద్యం మీకు వినిపించాలని వచ్చాను. ఆదరించండి అనగానే శాస్త్రి ఏదీ నీవు రాసిన పద్యం వినిపించు అంటే పద్యం చదివారు. శాస్త్రి ‘ఆ కుర్రవానితో ‘‘నువ్వు కవిత్వం చెప్పగలవు. నీకు సామర్థ్యం ఉంది పో అన్నారు. పద్మరాజుతో పాటు మరో కుర్రాడు వచ్చాడు. అతని పేరు చాగంటి కామేశ్వరరావు. వీరిరువురూ ‘రాజేశ్వర కవులమ’ ని చెప్పుకొంటూ పద్యాలు రాశారు. ఆ రోజుల్లో పద్యాలు రాసిన వారు ప్రసిద్ధులకు వినిపించి ఆశీస్సులు పొందేవారు. ఆయన జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. రోజువారీ జీవనంలో ఒడిదుడుకులు వస్తూండేవి. వాటిని తట్టుకొన్నారు. తొమ్మిదేండ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. తాతగారు రాజమండ్రి స్కూలులో పనిచేసేవారు. ముగ్గురు తమ్ముళ్లు, చెల్లితో తాతగారి గ్రామమైన తిరుపతిపురం చేరుకున్నారు. దెబ్బమీద దెబ్బలా తాతగారూ చనిపోయారు. దిగులు పడితే లాభం లేదనుకొని ఎదురింటిలో ఉన్న దర్జీకి సహాయంగా ఉంటూ కుట్టుపని నేర్చుకొన్నారు. తమ్ముళ్లు, చెల్లెలకు బట్టలు కుట్టేవారు.
పద్మరాజు బాల్యదశలోనే కవితలు రచించారు. తరువాత ఎంత కవిత్వం మీద ఉండేదో అంత తక్కువ రాశారు. వచనంలో కథా ప్రక్రియ అవలంభించి అందులో అపార ప్రావీణ్యం, ప్రతిష్ఠ ఆర్జించారు. ఒకసారి ములుకుట్ల వెంకటశాస్త్రి, వరద, పద్మరాజు ముగ్గురూ రైల్వేస్టేషనులో కలుసుకున్నారు. మాటామంతి అయ్యింది. అప్పుడు శాస్త్రి వరదా! పద్మరాజుపై రెండు పంక్తులు చెప్పు అంటే ‘‘వీడెవరి పాపరా! ఊయల ఊపరా! చనుబాలు చేపరా…’’ పద్మరాజుకు ఇరవైఒకటో సంవత్సరం వచ్చింది. అమలాపురానికి చెందిన సత్యానందంతో వివాహమైంది. ఆమె వయసు పన్నెండు సంవత్సరాలు. వారిరువురి మధ్య తొవ్మిదేళ్లు తేడా ఉన్నది. అప్పట్లో అది అంత పట్టింపు కాదు. కాపురానికి వచ్చింది. ఇల్లువాకిలి చక్క బెట్టింది. పద్మరాజుకు తగిన ఇల్లాలు అనిపించుకుంది. ఆయన బహు భాషా కోవిదుడు .ఆయన సంస్కృత పండితులు. జర్మని, ఫ్రెంచి భాషలు తెలుసు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ, మళయాళి భాషల్లో మాట్లాడగలరు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చదివారు. సబ్జెక్టు కెమిస్ట్రీ. చదువంతా స్కాలర్‌షిప్‌ మీదే జరిగింది. ఇంటికి రావా లంటే చేతిలో ఏమీ ఉండేదికాదు. ట్యూషన్లుచెప్పేవారు. దానివల్ల కొంత డబ్బును దాచుకొన్నారు. మిత్రుని సైకిలుతీసుకొని ఉత్తరప్రదేశ్‌లో చాలా చోట్లకు తిరిగారు. అందువల్ల అనుభవాలు కలిగాయి. ఆ అనుభవాలే కథలుగా వచ్చాయి. కథల్లో వచ్చే పాత్రలు చాలావరకు మనకెదురుగా కన్పించేవే. దీనివల్ల చిక్కుసమస్యలువచ్చాయి. ఒక కథలోదగ్గరి బంధువు నా కథే రాశావని తగవులాడిరది. చూసేవారికి విన్నవారికిది చిత్రమైంది.
పద్మరాజు వారు రాసిన ‘గాలివాన’ కు బహుమతి వచ్చింది. ఆ కథకు పూర్వరంగం యధార్థంగా జరిగిందే. ఒకసారి వారింట్లో దొంగలు పడ్డారు. దొరికినది తీసికొనిపోయారు. దొంగతనం జరిగితే ఇంట్లోని వారందరు విచారిస్తున్నారు. పోయిన వస్తువులతో భార్యపిల్లలు బాధపడ్తూంటే ఆయన దొంగ చాకచక్యాన్ని పొగిడారు. మనుషుల్లోని నెగిటివ్‌ క్యారెక్టర్‌ను పాజిటివ్‌గా చూడటం వారి అలవాటు. సాహితీ జగత్తులో పెద్ద పీఠం లభించింది. వారు రాసిన మొదటి పద్యం ముట్నూరి వారి ‘కృష్ణాపత్రిక’ లో వచ్చింది. తరువాత చాల పద్యాలు వచ్చాయి. కాటూరి వేంకటేశ్వరరావు దేవులపల్లి వారితో ‘‘బావా! ఈ పద్మరాజు గొప్ప కవి అవుతాడు. కవిత్వం వదలకపోతే’’ అన్నారు. వారు చిన్ననాటి నుండి పద్యాలు రాసేవారు. అప్పుడప్పుడు పాటలు రాసేవారు. ఆయన రాసిన కథలు చదివి బి.యన్‌.రెడ్డి పట్టుబట్టి మద్రాసు తీసికొని వెళ్లారు. పద్మరాజు కథ రాసి అందించిన మొదటి సినిమా ‘బంగారుపాప’ ఆ చిత్రం విజయ యాత్ర సాగించింది.
వారి సినిమా ప్రస్థానం నిరాఘాటంగా ముందుకు వెళ్లింది. దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ఇలా ఆయా శాఖల్లో తన ప్రతిభను చూపించారు. ఎంత సంపాదించినా తనకంటూ ప్రత్యేకంగా ఏమీ మిగుల్చుకోలేక పోయారు. చివరకు స్వంత ఇల్లు కూడ ఏర్పాటు చేసుకోలేకపోయారు.
వీరు జాతీయ చలనచిత్రఅవార్డుల సంఘంలో జ్యూరీమెంబరుగా ఉండేవారు. ఈ సంఘసమావేశాలకు హైదరాబాదు నుండి దిల్లీ వెళ్లారు. అక్కడి వాతావరణంవల్ల ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చింది. హాస్పిటల్‌లో చేర్చారు. చేరిన పదిగంటలకు ఆయన మరణించారు. పద్మరాజుకి జాషువా అంటే అభిమానం. ఈ అభిమానమే ‘రాడికల్‌ డెమాక్రటిక్‌ పార్టీ’ వైపు మనసు మరలింది. వృత్తిరీత్యా తాను దూరంగా మద్రాసులో భీమవరంలో ఉండియారు. లేకపోతే తెలుగుసాహిత్య చరిత్ర మరో విధంగా ఉండేదని పద్మరాజు వరద రాజేశ్వరరావుతో అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img