Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొన్ని పరిమళాలు


నలుగురితో మాట్లాడుకోవటం
పక్షుల కిలకిల రావాలు వినటం
వనాలు పచ్చని తోరణాలు కట్టటం
మొగ్గలువీడి గాలితో పలకరించటం
గాలిచేరి హృదయాలు వికశించటం
ఇసుక తెన్నెల్లో కూర్చుని
ఎగసే కెరటాల్ని చూడటంచుట్టూ ఊగే దృశ్యాల్ని
కళ్ళల్లో వొంపుకోవటం
ఆస్వాదించటం
నాలో సంచరించే కొన్ని పరిమళాలు.
వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటం
వర్షధారల్ని నింపుకోవటం
ఆశగా ఆకాశం వంకా
హరివిల్లు వంకా
కొంచెం కొత్తగా చూపుల్ని ఆరేసుకోపటం
నాకింకా అలానే
ఆనందాలు పొద్దు పొడుస్తున్నాయి.
దేహమంతా పరవశంతో
అనేక దీపాలుగా వెలుగుతుంది.
చిన్ని కొండలనూ ఎక్కి
దృశ్యాల్ని నింపుకుంటాను.
పిల్లకాల్వలో గెడ్డలలో
చేపలు పట్టుకుంటాను
కొన్ని పరిమళాల్ని
నాతో అంటిపెట్టుకుంటాను.
గవిడి శ్రీనివాస్‌, 7019278368

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img