Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చలి మంట

చెలరేగే చెట్ల కొమ్మల్లోంచి
ఊసులాడే ఆకుల సందుల్లోంచి
ముసిముసిగా నవ్విన కిరణాలు
ఒకింత చూపుల్ని ఒంపుతున్నాయి
కరుణించని చలి కొత్తగా కొరుకుతుంది
నిద్ర నుంచీ లేవనే ఉంటుంది
గాలికి ఎదురీదాలనే ఉంటుంది
చెవుల్లో గాలులు గంతులేస్తున్నాయి
మనసులో తపనలు
మధన పడుతుంటాయి
కాలాలు జారినపుడు
పూల పరిభాషలో వేసుకుంటాను
ఆకాశం రంగులు పులుముకున్నట్లు
కలలప్రపంచంలో రంగులపక్షిలా ఎగురుతాను
పిల్ల కాలువ నీటిలా చలి చలిగా వొణుకుతుంటాను
తెల్లవారు చలిమంట కోసం
ఎండిన ఆకుల కోసం
చూపులు పరితపిస్తుంటాయి.
కాలాలు ఎంతగొప్పవో కదా
మనం ఎలావున్నా
దాని ఉనికిని గుప్పెట్లో వాల్చుతుంది
ఎంత పోడుబారినా హత్తుకొనే చలిమంట పైనే
ఎంత ప్రేమ వరికంకులపై పిచ్చుకలు వాలినట్లు
-గవిడి శ్రీనివాస్‌, 7019278368

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img