Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జోహార్లు జైనీ మల్లయ్య గుప్త

పల్లవి:
నల్లగొండ తాలుకా భువనగిరి అగ్గిపిడుగు
లక్షమ్మ,నారాయణల ముద్దు బిడ్డ- జైనీ మల్లయ్య గుప్తా
స్వాతంత్య్ర సమర యోధ.. తెలంగాణ వీరుడా!
అందుకో మా వందనాలు జైనీ మల్లయ్య గుప్తా
నరమేధం సృష్టించిన రజాకార్ల నెదిరించి
రణ భూమిలో రంకెలేస్తూ.. పోరాటం జేసినోడు
యోధుడు మన కామ్రేడు జైనీ మల్లయ్య గుప్తా
మల్లి రాని దూరానికి ఎల్లిన మల్లయ్య గుప్తా
అందుకో మా వందనాలు కామ్రేడా మల్లయ్య గుప్తా
ఎర్ర జెండా ప్రాణమని గుండెలోన దాసుకోని
బందూకు ఎత్తు కోని ముందుండి నడిచినావు
భూస్వాముల గుండెలోన గునపమై నిల్చినావు…
ప్రజల కొరకు జంగ్‌ నడిపి జైలు అనుభవించినావు
వీరుడా!మల్లయ్య గుప్తా అందుకో మా వందనాలు
ఉర్దు దప్ప తెలుగు లేని నైజాముల రాజ్యంలో
ఆంధ్రమహాసభలతో ప్రజలకు చైతన్యం నింపినావు
దున్నెవాడిదే భూమి నినాదం పల్లె పల్లెకు చాటినావు
భూస్వాముల వద్ద ఉన్న భూమి గుంజి పంచినావు
అందుకో మా వందనాలు కామ్రేడా మల్లయ్య గుప్తా
సామాజిక ఉద్యమాల్లో ముందుండి సాగినావు
దొరల గడీల నుండి విముక్తి కల్పించినావు
దోపిడిక చెల్లదని ప్రజా పోరు జరిపినావు
ఉర్దు భాష ప్రేమికుడా..! సామాజిక, సాహిత్యవేత్త
వీరుడా..! మల్లయ్య గుప్తా విప్లవాల వందనాలు
గ్రామీణ భూస్వామ్య, దొరల దౌర్జన్యాలకు
నిజాముల రాచరీకం నడవదని చాటినావు
అజ్ఞాత వాసంలో ఆకు,అలము తింటివి…
జనం కొరకే నీ జన్మంటివి జెండా కింద కడ వరకుంటిని
నిత్య పోరాట సమర శీలి- లాల్‌ సలాం మల్లయ్య గుప్తా
మిత్ర మండలి స్థాపించి-శత్రు సేనలనెదిరించి
మల్ల యుద్ధం జేసినావు నైజాముల తరిమినావు
నీ దారిలో మేమంతా ఏకమై సాగుతాము
నీ వీడిన పోరు జెండా ఎత్తి పట్టి పోరుతాము
మా గుండెలో నీ పేరు చిరకాలం ఉంచుతాము
నీ యాదిలో మేమంతా ఉద్యమాలు నడుపుతాము
-జి. చంద్రమోహన్‌ గౌడ్‌, 9866510399

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img