Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జ్ఞాపకాలు

సతాయిస్తున్న
జ్ఞాపకాలను
ఉతికి
దండెం మీద
ఆరేశాను!
జ్ఞాపకాలను
వేడి వేడి బజ్జీల్లాగా
ఊదుకుంటూ
తింటున్నాను!
జ్ఞాపకాల/జడిలో
తడిసి/ముద్దయ్యాను!
జ్ఞాపకాలు
మొలుస్తున్నాయ్‌
పచ్చగా/పంట నూర్చి
అందరికీ
పంచేదెప్పుడో?
నెరిసి/రాలిపోతున్న
జుత్తులో
జ్ఞాపకాల
డి ఎన్‌ ఏ జాడలు!

  • కేశవ్‌ గోపాల్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img