Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

నమ్ముకున్న నేలను కమ్ముకున్న ‘కేతు’ కథనం!

ఎబికె
కథ గాలినుంచీ పుట్టదు. గాలి కబుర్లనుంచీ పుట్టడు! దాని ముడిపరుకు ప్రకృతీ, మానవ జీవితమూ, పరిసరాలూ, అవి మానవునిలో కల్పించే ఆలోచనలూ, అనుభూతులూ మానవుని ఉనికినీ, అతని గమనాన్నీ దిద్ది తీర్చే పరిసరాలనుంచి కథ పుడుతుంది. నిజానికది ఉబుసుపోని కథకాదు, మానవుడి ఉసురుకు సంబంధించిన గాథ. ఆ ఉసురు నిలబెట్టుకునేందుకు జరిపే జీవన సమరంలో ఎదురయ్యే సుఖదుఃఖాల కలనేతా, వడపోతే కథ. కనపడుతున్న జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి ఎవరికివారే ప్రత్యక్షసాక్షి అయినప్పుడు వేరే కథ దేనికి? రహస్యమంతా అక్కడే ఉంది: ఎవరికథ వారికి తెలియొచ్చుగాని, మరొకరి గాథ ఎదుటివారికి తెలియదు. ప్రత్యక్ష పాత్రల సృష్టి చరిత్ర అవుతుంది. చారిత్రక సన్నివేశాలూ, జీవన సమరమూ పరోక్ష పాత్రలద్వారా కథావస్తువులవుతాయి. మనకథను మన పేర్లతో యథాతథంగా అచ్చుకెక్కిస్తే ‘పరువు నష్టం’ అవుతుంది, మనకు ఉన్నమాటంటే ఉలుకెక్కువ కాబట్టి పరువు నష్టపు దావాలు రాకుండా ఉండేందుకైనా మనకు ‘కత’ అవసరం! పంచతంత్ర కథలు, గాథా సప్తశతి, క్షేమేంద్రుని కథా సరిత్సాగరం అలా వెలసినవే. ప్రతి కథకుడూ ఒక విష్ణుశర్మో ప్రశ్నించేవాడు ఒక నాచికేతుడో అయితే తప్ప మన ప్రవర్తన మారదు. మన తార్కిక దృష్టి సునిశితంకాదు. కథలు అందురూ చెప్పగలరుగాని, నేలతల్లి కథను వెలార్చగలవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొలది మంది అభినవ కథక చక్రవర్తులలో కేంద్రసాహిత్య అకెడెమీ పురస్కారానికి ఎంపిక అయిన కేతు విశ్వనాథరెడ్డి ఒకరు. రాయలసీమ కథక రత్నాలలో చెప్పుకోదగిన వారు మధురాంతకం రాజారాం, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కేతువిశ్వనాథరెడ్డి అగ్రస్థానంలో నిలబడతారు. గ్రామానామాల పరిశోధన గ్రంథంతో పాటు కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంపుటాల సంకలనకర్తగా, తెలుగు అకాడెమీ ప్రచురణల సంపాదకుడిగా, ఓపెన్‌ యూనివర్సిటీ భాషాపాఠ్యాంశాల రూపశిల్పిగా పేరులోకి వచ్చిన కేతు కొన్ని తెలుగు అకాడెమీ ప్రచురణలకు, అంబేడ్కర్‌ రచనలు కొన్నింటికీ సంపాదకత్వం కూడా వహించారు. జీవితం జానపదకథల్లో వర్ణించినట్టు ఉండదని కేతుకు తెలుసు. అందుకే సమాజ పరిణామ క్రమాన్నీ, జానపదుల జీవితాన్ని రాయలసీమ పూర్వరంగంనుంచి పరిశీలించినా ప్రాంతీయ సరిహద్దులకూ, ప్రాంతీయ దురభిమానాలకూ దూరంగా ఎదిగి, సామాజిక రుగ్మతలకు కారణాలు చెప్పి సంఘజీవులలో చైతన్యం కలిగించడానికి ‘కథ’ను మాధ్యమం చేసుకున్న సంస్కారి కేతు! వచ్చిన పురస్కారం కేతు ‘‘కథలు’’కు కావచ్చుగాని, ‘‘వేర్లు’’, బోధి’’ అన్న ఆయని రెండు నవలలూ కూడా ఈ పరిధికి తీసిపోని రచనలే. కేతు పరిసరాలనేకాదు, మానవుని మనస్తత్వాన్నీ పరిశీలించాడు. పాతికేళ్ళ సాహిత్య వ్యవసాయంలో ప్రగతిశీల దృక్పథాన్ని విడవకుండా, ఉబుసుపోని రచన చేయకుండా సమాజ ప్రయోజనమే ‘కథా’ ప్రయోజనమూనని ప్రకటించి పాఠకుల మనస్సుల్ని నిత్యచైతన్యం వైపూ, వాస్తవిక దృక్పధం వైపూ నడిపిస్తున్న రచయిత కేతు. పురస్కారం పొందిన కథల సంపుటి- ఓ యువకుడి ఆత్మహత్య కారణాలను తెలుసుకోవడంతో కేతు ప్రారంభించిన అన్వేషణ, నిస్సహాయుడైన నిరుద్యోగి కథగా రూపుదాల్చింది! పెక్కు కథలను జగతి పరిణామ సాక్షిగా, తానే వ్యాఖ్యాన కర్తగా పాత్రలను సంభాషణల్లోకి దించి దిద్ది తీర్చాడు. చిన్ననాడు తన ‘జేజెమ్మ’ చెప్పిన కథలను చెవికోసుకుని విన్న కేతు నీతికథల సారాంశాన్ని ఒంటబట్టించుకొని సంఘజీవిగా మారి సామాజిక పరివర్తనలో న్యాయా న్యాయా లను బేరీజు వేసుకొన్నాడు. తన చిన్నప్పటి పల్లెటూరి అనుభవాలను, ఫ్యూడల్‌ (భూస్వామ్య) వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కాకుండానే పెట్టుబడిదారీ దోపిడీ పద్ధతులకు క్రమంగా లోనవుతున్న పల్లెపట్టులలో వస్తున్న పరిణామాలను, బతకలేక పేదసాదలు సాగిస్తున్న వలసలను కళ్ళారా గమనిస్తూ వచ్చినవాడు కేతు. పేదల సమస్యలు పట్టించుకొన్నాడు. వారి గుండెకోతను అర్థంచేసుకున్నాడు. కంకర కొట్టే రోడ్డు కూలీల బతుకు బాధల్ని, రైతులు, వ్యవసాయ కార్మికుల బతుకుల్ని దగ్గరగా పరిశీలించాడు. తాతలనాటి రూపాయి కూలినే ధరలు చుక్కలంటుతున్న రోజుల్లో కూడా ఇవ్వజూపే మోతుబరుల్నీ, మనస్తత్వాల్ని పరిశీలించాడు. చదువు నేర్చిన ప్రొఫెసర్లు కూడా ‘బాబా’ల మైకంలో పడి తమను మోసగించుకోవడమేగాక, సమాజాన్ని కూడా ఎలా మోసగించ ప్రయత్నిస్తారో ఈ కథల్లో చెప్పాడు. అందుకే కేతు అన్యాపదేశంగా తన కథల లోకం ఎలాంటిదో చెబుతూ ‘‘నేను చదివిన కథల లోకమే అద్భుత మయింది, పిప్పరమెంటులా తియ్యనైంది. ‘రమ్ము’లాగా మత్తెక్కించేది’’ అంటాడు!
నిజానికి జీవిత కథను వర్ణించడానికి అల్లసాని వాడి గజిబిజి భాష అక్కరలేదు, కర్పూర తాంబూలాలిచ్చే ప్రియదూతికలూ అక్కర్లేదు, ‘రమ్ము’ లూ ‘విస్కీ ‘దమ్ములూ అక్కరలేదు! జానపదుల జీవితాన్ని, మధ్యతరగతి మనస్తత్వాన్ని, సంపన్నుల అతిలోలతనూ వర్ణించి చెప్పడానికి రచయితకు పరిసరాలే పరమౌషధాలు! నిజానికి ఈ కథల్లో కేతు ముడిపదార్థం పల్లెపట్టులూ, వాటి పరిసరాలూ, పారిశ్రామిక లోకమూ. పారిస్‌ ఇంటర్వ్యూస్‌ ఆధ్వర్యంలో వెలువడిన ‘‘రైటర్స్‌ ఎట్‌ వర్క్‌’’ రెండవ సంపుటానికి ముందుమాట రాస్తూ వాన్‌ వీక్‌ బ్రూక్స్‌ రెండో ప్రపంచ యుద్ధకాలంలో జీవించిన పెక్కుమంది రచయితలు అంతర్జాతీయ దృక్పథాన్ని అలవరుచు కున్నారనీ, వారు స్థానిక సమస్యలనుంచి ప్రేరణ పొందిన దృష్టి సంకుచిత హద్దుల్ని అధిగమించి మనస్సుల్ని విశ్వజనీనం చేసుకున్నారని తెలిపాడు. వసుధైక కుటుంబం వాళ్ళ ధ్యేయం అన్నాడు. అలాంటి దృక్పథాన్ని కేతు అలవరచుకున్నాడు. రచన సరదాకోసం కాదని కేతుకు తెలుసు. అందుకే వ్యంగ్య ధోరణి ఉన్న కథనాన్ని సీరియస్‌గా నడుపుతాడు. కేపల చమత్కారమే కాదు, కథావస్తువునుగాని, అందలి సంభాషణనుగాని పలచబరచడు. రచనలో మనస్సును పట్టించే శైలితోపాటు ఏ డైరెక్షన్లో కథాగమనాన్ని తీర్చిదిద్దాలో అతనికి తెలుసు! శిల్పానికీ, వస్తువుకూ మధ్య అద్భుతమైన సమన్వయం సాధించిన రచయిత కేతు. ఈ విషయంలో ఎజ్రాపౌండ్‌ చెప్పిన మాటలు ఈయనకు అక్షర సత్యాలుగా వర్తిస్తాయి: నిుష్ట్రవ ఔష్ట్రa్‌ ఱం ంశీ ఎబషష్ట్ర ఱఎజూశీత్‌ీaఅ్‌ ్‌ష్ట్రaఎ ష్ట్రశీషు అంతేగాదు, సమకాలిక సమాజ పరిస్థితుల్లో ఒదుగుతూనే తనకాలపు జీవన సమరాన్ని ప్రతిబింబించగల రచయితగా జీవితమే సార్ధకం అన్నాడు. రచయిత ఒక రాడార్‌ లాంటివాడు. అతడొక యాంటినా, సమాజాన్ని ఊగించి శాసించబోయే ఉత్పాతాలనూ పరిణామా లనూ పసికట్టగల ‘యాంటినా’ కథకుడన్నాడు హెన్రీ మిల్లర్‌ (నిA షతీఱ్‌వతీ ఱం a ఎaఅ షష్ట్రశీ ష్ట్రaం aఅ్‌వఅఅaవ…సఅశీషం ష్ట్రశీష ్‌శీ ష్ట్రశీశీస బజూ ్‌ష్ట్రవ షబతీతీవఅ్‌ం షష్ట్రఱషష్ట్ర aతీవ ఱఅ ్‌ష్ట్రవ a్‌ఎశీంజూష్ట్రవతీవు) ఒకథా రచన ఒక ఇంద్రజాల విద్య అని కొందరంటారు! అయితే గురజాడ, కుటుంబరావు, మా గోఖలే, రా.వి.శాస్త్రి, పద్మరాజులా కేతు విశ్వనాథరెడ్డి కథ ఉనికిని సామాజిక ప్రయోజనానికి నిబద్ధం చేసినవాడు. ‘‘నిబద్ధత’’ పదాన్ని ప్రగతిశీల రచయిత లంతా ఇప్పుడు వాడుతూండ వచ్చుగాని మొదటిసారిగా రచనలో ప్రవేశపెట్టిన వాడు పోతనామాత్యుడు! పాశ్చాత్య ప్రపంచంలో ఈ నిబద్ధతకువారసులు హెన్రిక్‌ ఇస్బన్‌, అనటోల్‌ ఫ్రాన్స్‌, హెమింగ్‌ వే, లారెన్స్‌, మపాసా, సోమర్‌ సెట్‌ మామ్‌, గాటియర్స్‌, కోలేటి. వాస్తవికత, హేతువు-రెండు చక్రాలుగా రచనాప్రక్రియను వారు సుసంపన్నం చేశారు.
అలాగే కేతు కూడా వాస్తవికత, హేతువాద దృక్పథంతో పాటు వర్గదృక్పథంనుంచి కూడా తన కథనాన్ని సునిశితం చేశాడు. ‘‘మార్పు’’లో కూలినాలి జనం బతుకు చితుకులనూ, దోపిడీ వ్యవస్థ స్వరూపాన్ని చూపాడు. ‘‘సానుభూతి’’ కథ ద్వారా సాగుసమస్య పేరిట భూ సమస్య వేస్తున్న వెర్రితలలూ, వాటి ఆధారంగా పెచ్చరిల్లుతున్న రైతు కూలీ తగాదాల గుట్టును రట్టుచేశాడు. రాయలసీమ ప్రజల మూల్గుల్ని పీలుస్తున్న పాళెగాళ్ళ రాజ్యపు అవశేషాలుగా ఉన్న హత్యారాజకీయాలకు అద్దంపట్టిన కత ‘‘వెనక-ముందూ’’! అవకాశ వాదుల్ని ఎండకడుతూ కేతు ఒక పాత్రద్వారా ఇలా అనిపిస్తాడు: ‘‘కుక్కల్లా కొట్లాడ్డానికి పార్టీలెందుకురా? (వీడికి) మందువాసన తగిలితేనే తలకాయ తిరుగుతుంది….(వీడు) మారడమా? ప్రత్యేకాంధ్రో ద్యమంలో తెలంగాణావాళ్ళను బండ బూతులు తిట్టాడు. ఏ ప్రాంతంవాళ్ళూ వాడికి ముద్దుకాదు. అవకాశం దొరకాలిగానీ ప్రత్యేక కడప రాష్ట్రమే కావాలంటాడు! మంత్రివర్గంలో లేని రాజకీయ నాయకులెంత ప్రమాదమో, వీడిలాంటి ప్రాక్టీసులేని లాయర్లూ అంతే ప్రమాదం దేశానికి!’’ భూమిని నమ్ముకొనే రోజులు పోయాయని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకని? భూసంస్కరణ చట్టాన్ని తప్పించుకోడానికి మోతుబరులు సవాలక్ష మార్గాలు వెతికారు కాబట్టి! సమగ్ర సంస్కరణలు రానందున సమాజానికి వస్తున్న నష్టమేమిటో, పంట భూములు క్రమంగా ఎలా పారిశ్రామిక వాడలుగా మారి పల్లె జీవితాలను చిందరవందర చేస్తున్నాయో, పెద్ద ఎత్తున బతుకు తెరువుకోసం కూలీ నాలి వలసలు ఎలా సాగుతున్నాయో ఈ కథలు చెబుతాయి: ‘‘తల్లినో, తమ్ముణ్ణో, ఎవరోఒకర్ని తాకట్టుపెట్టే రోజులు ఇప్పటికే రాలేదంటారా? అంతగా రాకపోతే నీ నల్లరేగడి మీద తుంగభద్ర నీళ్ళు పారనీ, నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు రానీ-అన్నీ అబద్ధాలబతుకులే, అన్నీ డబ్బుచుట్టూ తిరిగే జీవితాలే అని తెలిసొస్తుంది. వెనకా ముందూ అంతే’’ అని చెప్పిన పాత్ర కథకుని దూరదృష్టికి నిదర్శనం! హత్యారాజకీయాల ముచ్చట్లో భాగంగా ఒక పాత్ర ‘‘సివిల్‌ కేసులు నాన్పుడే అయినా కనీసం మనుషులన్నా మిగులుతారు, క్రిమినల్‌ కేసుల్లో అయితే అదీ లేదు’’ అని ఆయన కలం అక్షర సత్యం పలుకుతుంది! ‘‘చిత్తశుద్ధిలేని శివపూజల’’ వల్ల దేవాలయాలు, వాటిని అంటిపెట్టుకుని ఉన్న ఆచారాలు ఎలా కలుషిత మయ్యాయో ‘‘ఆత్మరక్షణ’’ ఏకరువు పెడుతుంది! పూజారి వ్యవస్థ లోపాల్ని ఎత్తి చూపుతుంది! ఒక అనాథ స్త్రీ బతుక్కి అక్షరరూపం ‘‘ప్రేమ రూపం’’. ప్రేమకు కొత్త నిర్వచనాన్ని ఇందులో కేతు సాధించాడు. ఊళ్ళోదిక్కులేని ఆడదాన్ని నలుగురూఎలా ‘‘కుక్కల్లా’’ వెంటాడుతారో చెప్పాడు. అవసరమే ఆశ అని తేల్చిన వెనక గోరాశాస్త్రి ‘ఆశ ఖరీదు అణా’ కథరాశాడు) కేతు గొప్ప కథ ‘నమ్ముకున్ననేల’’. అది ఒక ఊరి కథ, ఒక తరం కథ, పల్లెల కథ! పారిశ్రామిక యుగం మార్పులకు లోనవుతున్న నేల తల్లి పురిటి నొప్పులు చెప్పేకథ ఇది! పూర్వవైభవం కోల్పోతున్న పుడమి తల్లి బాధలు చెప్పాడు. మంచి అలవాట్ల స్థానంలో ‘మట్కా’ చార్టులకు ఆకర్షితులవుతున్న కుర్రకారును హెచ్చరించాడు. మారిపోతున్న సంఘజీవనంలో చివరికి ‘‘మూఢనమ్మకాలతో కూడిన సంఘజీవనం కూడా’’ లేదంటాడు కేతు! కరువూ, అవసరమూ ముమ్మరించి భూముల విలువల్ని కోతపెడుతుంది! స్త్రీ ఇప్పటికీ ఒంటరిగా బతకడం ఈ సమాజంలో ఎంత కష్టంగా ఉందో చెప్పిన కథ ‘రెక్కలు’’. ఇలా ఒకటా అరా! అన్ని కథలూ ఆణిముత్యాలే. సంఘానికి మూలముట్టుగా దిద్దుబాటు జరిగేదాకా కేతు కథాస్రవంతి కట్టలు తెంచుకుని పారుతూనే ఉండాలి! కేతు కథాక్రమంలో నేలతల్లి వాసనలు చూపించాడు. ముచ్చటైన మాండలిక ప్రయోగాలు- ‘‘సంచకారంగా’’ (బయానా) పెట్టాడు. ‘‘మంగతై’’ (జూదం) ఆడిరచాడు, ‘ముదెబ్బల’ కాలం చూపించాడు. దెబ్బతిన్నవాడు దాయాదిగా ఎలా మారుతాడో చెప్పాడు!
కేతు భాషాశాస్త్రవేత్తగా మాండలికాలతో చాకిరీ చేయించుకున్నాడు, ప్రయోగంలో సరసమైన ప్రతీకలూ వాడాడు. ఆద్యంతాల బిగింపులో చమత్కారాలు పోయాడు. ఆక్టోవియా పాజ్‌ అనలేదూ: నిుష్ట్రఱం బఅఱఙవతీంవ ఱం a ఙaర్‌ ంవర్‌వఎ శీట ంఱస్త్రఅరు అని! ఈ ప్రతీకలు భాషకు ముడిపదార్థాలు! సుప్రసిద్ధ నాటక రచయిత యూజినీ అయెనెస్కీ అసంబద్ధ నాటకోద్యమ నాయకుడైన శామ్యూల్‌ బెకెట్‌ గురించి రాస్తూ మాటల్లేకుండా మౌనం ద్వారా బెకెట్‌ భాషను ఖూనీ చేస్తే, భాషను అతిగా వాడి తను నూతన పదసృష్టి చేస్తానన్నాడు (నిదీవషసవ్‌్‌ సవర్‌తీశీవం శ్రీaఅస్త్రబaస్త్రవ షఱ్‌ష్ట్ర ంఱశ్రీవఅషవబీ I సశీ ఱ్‌ షఱ్‌ష్ట్ర ్‌శీశీ ఎబషష్ట్ర శ్రీaఅస్త్రబaస్త్రవ, షఱ్‌ష్ట్ర షష్ట్రaతీaష్‌వతీం ్‌aశ్రీసఱఅస్త్ర a్‌ తీaఅసశీఎ aఅస పవ ఱఅఙవఅ్‌ఱఅస్త్ర షశీతీసరు). కాని కేతు ఈ రెండు ధోరణులకూ మధ్యగా తన రచనా వైచిత్రిని ప్రదర్శించగలిగాడు. మౌనానికీ, అతికీమధ్య భేదం చూపాడు! వ్యక్తిగా కేతు ఎప్పుడూ చిరునవ్వులొలికిస్తూనే ఉంటాడు. ఆ ఆనందానికి హద్దులు లేవు. తన ఉనికిని అనుక్షణం అనుభవించడం అందరికీ చేతకాదు. బహుశా అందుకేనేమో పాబ్లో నెరూడా ఫాసిస్టు దమనకాండకు బలైన గార్సియా లోర్కా గురించి అని ఉంటాడు: నిa స్త్రతీవa్‌ ంజూవఅస్‌ష్ట్రతీఱట్‌ శీట ష్ట్రaజూజూఱఅవంరు! నేటి కథానాయకుడు కేతు విశ్వనాథం ఇందుకు మినహాయింపు కాదు!
(రచనా కాలం : ఆదివారం 22, డిసెంబర్‌, 1996 ` ‘‘నిబద్ధాక్షరి’’ సంపుటి)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img