Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విమర్శలోనూ వైపరీత్య ముంటుంది!

చందు సుబ్బారావు

విమర్శఅంటే ఏమిటి?..అన్న ప్రశ్నకు పండితులు ‘తప్పొప్పుల పరిశీలన’ అన్నారు. ఆ పరిశీలనను నీకు అప్పగించారు కదా అని విమర్శకుడు ‘రావణాసురుడిదే రైటు, పాండవులకు రాజ్య హక్కు లేదు. సుయోధనుడు ‘మరదలు’ కదా అని ముచ్చటపడి ద్రౌపదిని వస్త్రాపహరణం కోరితే రెచ్చిపోయి శపథాలు చేస్తారా. అల్లూరి సీతారామరాజును ఎదురు తిరిగితే చంపరా మరి..అంతా బ్రిటీష్‌ వారిదే అయితే మధ్యలో నీ గొడవేమిటి అని గ్రంథం రాయ వచ్చును. సద్విమర్శ అన్నారు కదయ్యా అంటావా అది సద్విమర్శో, కువిమర్శో తేల్చేదెవరు? మరొక విమర్శకుడే కదా. మంత్రదండా లేమీ లేవు కదా. అంటే దాదాపు నీ ‘సహృదయం’ పై ఆధారపడి ఉంటుంది. అందుకేనేమో అలంకారికులు సాహిత్య సృష్టికి ‘సహృదయం’ అవసరం అన్నారు. విమర్శకుడికి ఇది మరీ అవసరం. న్యాయ నిర్ణయం బాధ్యత కదా తనది.
నండూరి వారి ‘ఎంకినాయుడుబావ’ పాటను చెడతిట్టిన విమర్శకుని పేరు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు. ‘నేటి కాలపు కవిత్వం’ అనే ఆయన గ్రంథం తెలుగు సాహిత్య విమర్శకే తలమానికం. ఆయన భావకవుల్ని చెడతిట్టాడు. ఎంతసేపూ పువ్వూ, కాయా, చిలకా, కోయిలా అంటుంటారు. సమాజ విషయాలు పట్టవా అంటూ..బాగానే ఉంది. ‘ఎంకీ నాయుడు బావ’ అంట. పేరు చూడండి ఎంత లక్షణంగా ఉందోనాయుడు బావ అనే పేరు అగ్రవర్ణాలకు చెందింది. ఎంకి అనే పేరు గ్రామా ల్లోని కడజాతివారికి ఉంటుంది. అందుకని నాయుడుగారూ, ప్రేమ అని చెప్పి ఆ పిల్లను ఏ పొలాల్లోనో పట్టుకుని అన్నీ పూర్తి చేయండి అని చెబుతున్నామా. ఇదేనా కవిగారి సామాజిక సందేశం అంటూ చెడతిట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అటు చూడబోతే పాండితీ పండితుడు..ఇటు చూడబోతే అద్భుతమైన కవితలు రాసిన నండూరివారు..ఆలోచించి..ఆలోచించి కవి పండిత సమూహం అక్కిరాజు వారికి ఎవరూ సమాధానం యివ్వ కూడదని నిర్ణయించారు. ‘ఉపేక్ష’ తగిన శిక్ష అని భావించారు. నిజంగానే విమర్శ గ్రంథం కాలం మరుగున పడిరది. అవునండీ ఆవేశం, ప్రేమ, కోర్కె, ఆనందం అన్నీ కవికి ఆభరణాలే. అయితే అవి కృత్రిమాభరణాలుగా ఉండాలి లోనికి పోగూడదు. ఈవేళ విషాద కావ్యం రాస్తూ కృంగిపోయీ, రేపు ఆనంద కావ్యం రాస్తూ పొంగి పోయి నృత్యం చేస్తే ఎలా. కళ అంటే ఏమిటి. కృత్రిమ సృష్టి. తెచ్చిపెట్టుకున్న ఆవేశం. జుఎశ్‌ీఱశీఅ టశీతీ ్‌ష్ట్రవ ంaసవ శీట వఎశ్‌ీఱశీఅ ఱం ్‌ష్ట్రవ aఱఎ శీట aత్‌ీ అన్నాడు ఆస్కార్‌ వైల్డ్‌. ఉత్తమ, కావ్యాల రసపట్టులన్నీ యీ ఆవేశాల మాలికలే. యీ కవిగాడు (లేదా యీ రచయితగాడు) యింత తీవ్రమైన అనుభవం ఎప్పుడు పొందాడ్రా అని అడగకూడదు. అప్పు తెచ్చుకున్న అనుభవాలే. కామ వాంఛతో సహా. లేకుంటే ఊర్వశిపై విశ్వామిత్ర వాంఛ పరిమితులు దాటితేనే సంగమించి శకుంతల జనానికి కారణ మయ్యారు. అది యావత్తూ కాళిదాసుక్కూడా కలిగిందనవచ్చునా? రసానుభూతికి మేధ, హృదయమూ చాలును. స్వీయానుభూతి అవసరం లేదు. స్వీయానుభూతులు రాసినవాళ్లు లేకపోలేదు. చలం రచనల్లో ఎక్కువ భాగం స్వీయానుభూతులు కూడా ‘మా కొద్దీ తెల్లదొరతనమూ’ రాసిన గరిమెళ్లకు ఉద్యమంలో ప్రత్యక్ష ప్రవేశం కూడా ఉన్నది. అరెస్టు చేసి జైలుకు పంపించారు బ్రిటీషువారు. శ్రీశ్రీ విప్లవ కవితావిర్భావానికి కొంత స్వీయాను భూతులు, కొంత ప్రపంచ దార్శనికతా తోడయ్యింది. అవతల సోవియట్‌ విప్లవం రావటంతో ‘‘గర్జించు రష్యాగాండ్రిరచు రష్యా’’ అనగలిగాడు. ఇక్కడ కూడా విప్లవం వచ్చి దేశం సుభిక్షం అవుతుంది. ఆకలి నశిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది అని వాంఛించటం ఆశయం. ‘భావికాల స్వర్ణ భవన నిర్మాతా వ్యక్తి స్వతస్సిద్ధ స్వాతంత్య్రదాతా’ అనటం ఆశయ వ్యక్తీకరణ. కొందరు విమర్శకులు ‘రాబోయే యుగకర్త, మహా కవిత్వ సృష్టికర్త’ అని కీర్తిస్తే, కొందరు విమర్శకులు శాపనార్థాలు పెట్టి నిందించారు. చెడతిట్టారు. దుర్మార్గుడన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి శత్రు వన్నారు. విదేశీతొత్తు అన్నారు. ఈ విమర్శ ఎంతవరకూ వెళ్లిం దంటే అందులో ఆ‘ఆంధ్రప్రభ’ వంటి పెద్ద పేరున్న పత్రికలూనార్ల వేంకటేశ్వరరావు, నీలంరాజు వెంకట శేషయ్య వంటి ప్రఖ్యాత పాత్రికేయులూ ఉన్నారు. ఈ దాడికి శ్రీశ్రీ మనస్సు చలించి, భయంతో కంపించి ఆయనకు కొంతకాలం మానసిక రుగ్మత ప్రాప్తించింది. ఆధునిక వైద్యం పుణ్యమా ఆయన బతికి బయటపడి మరో ముప్పయి ఏళ్లు ( 1955 నుండి 1985 వరకు) తెలుగు సాహిత్యంలో అనర్ఘ రత్నాలకు జన్మనిచ్చాడు. ‘‘కువిమర్శా మృణ్మయ నిర్జవమస్తిష్కులు గ్రహింపజాలుదురామత్‌ ఛవిమత్‌ పవివత్‌ కవితాక్షి విలోకన తీక్షణధారసిరిసిరిమువ్వా’’ అని పద్యంలో ఎత్తి పొడిచారు. మట్టి బుర్రలకు నేను అర్థం అవుతానా అని ఆక్షేపించాడు. శ్రీశ్రీ ప్రతి విమర్శలోనూ చెడతిట్టిన సందర్భాలు లేకపోలేదు. ఇవి కవులు విమర్శకులై పార్ట్‌టైమ్‌ జాబ్‌ నిర్వహించిన సంగతులన్న మాట. చెప్పొచ్చిందేమిటంటే విమర్శ కూడా కళా ప్రక్రియ. వైల్డ్‌ అన్నట్లు కళా ప్రక్రియకు ఆవేశం అత్యవసరం. విమర్వ వైద్యుడి పరీక్షల్లా, కాగితంపై రాసిచ్చే మందుల్లా, అర్జంటుగా గుచ్చే సూది మందుల్లా ఉండలేదు. కాకపోతే సద్విమర్శ కొన్ని హద్దుల్లో ఉండాలని కావ్య పరిశీలనకు కొన్ని సూత్రాలు పాటించాలనీ, నెగెటివ్‌ వ్యాఖ్యలకు పరిమితులూ, నియమాలూ ఉంటాయనీ సూచించారు. ఒకానొక ప్రఖ్యాత విమర్శకుడు ఒక కవిని విమర్శిస్తూ ‘‘యీ కవితలు రాసిన యితడి చేత్తో అన్నమెలా తింటాడు’ అన్నాడు..! అన్నానికీ, కావ్యగుణానికీ అందులో జరిగిన పొరపాటుకూ సంబంధమేముంది. ఆ పొరపాటుకూడా నీ దృష్టిలో కాదు కాదు అది మంచిఅలవాటు. మంచికవితే అని మరొక విమర్శకుడు రాయవచ్చును. దానికేమనాలి?
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img