Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సత్యానంతరం

`డా॥కె.ఎస్‌.చలం


మీరక్కడే ఉండి పోయారు
ఘనీభవించిన మంచు గడ్డలా
మీ రక్తం బొట్లు బొట్లుగా
కారుతూ చివరి దశకు చేరుకుంది
కొత్త రక్తం కావాలి, బలి దానాలు కావాలి
ప్రత్యామ్నాయం ఉందేమో చూడాలి!
నేను పాదరసం లాంటి వాన్ని
నన్ను మీరు తాకగలరా
మీ విజ్ఞానం, నిబద్ధత
నాకామడ దూరం
నీతి, నిజాయితి, పాపం, పుణ్యం
మంచీ చెడ్డ, దేవుడు దెయ్యం
నాకు కాదు మీ కోసం
నేనే దేవుణ్ణయినప్పుడు
నా కవసరమా!
మీరు చెప్పే మూడువేల చరిత్ర
మరో రెండు సున్నాలు చేర్చండి
అదెప్పుడూ స్థిరమైనది నేనే
నిజం నిప్పూ కాదు, తుప్పూ కాదు
నా ప్రవచనాల చుట్టూ తిరుగుతుంది
అక్షరాలు, రేడియో, టివి మొత్తం మీడియా
నా భావ భ్రమణ సుడిగుండం
సత్యంతో పనేముంది
ప్రమాణాలన్నీ నా చేతిలో ఉంటే
మీ తీర్పులు నిట్టూర్పులే
కవిత్వం, కాకరకాయ సాహిత్యం
కొత్తీమీరకట్ట, ఫ్రిజ్‌లో పెట్టు
భారతీయ ఆత్మా దర్శనం కాలేదా!
అప్పటి నుండి సత్యాన్వేషణే
అంతఃదర్శనం, ఉత్తమోత్తమం
గెడ్డాలున్నా, తలలు బోడులైనా
తత్వం ఒక్కటే
అహం బ్రహ్మాస్మి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img