Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సదాశయ సంకల్పం

మనసంత మురవంగ
మేను పరవశించగ,
అందాల లోగిళ్ళ ముంగిళ్ళు
సంతసాల సౌరభమవగ,
వాడిపోని మల్లెల చిరునవ్వులతో
అంబరాన సంబరాలు మోసుకొచ్చిన
‘‘నవ్యాంగ్లవత్సరం’’లో
అనుభవాల ముల్లె
భద్రంగా దాచుకొని
మమతల మూట విప్పి
చెలిమితోటలో విహరిస్తూ
స్నేహపరిమళాలు ఆస్వాదిస్తూ,
మమకారాల సిరులు పొందుదాం.
ప్రతి ఎద సంతోషసాగరమై
ఆనందం వెల్లువై పారేటట్టుగా
మానవత్వ మాధుర్యాన్ని పంచుతూ,
తోటివారికి చేయూతనందిస్తూ,
ఎవరికెవరమోకాక
అందరికీ అందరమై,
నిష్కల్మష హృదయంతో
మహోన్నత వ్యక్తిత్వంతో
విజయాల పూలు పూయిస్తూ
మార్పుతో మంచి సాధిద్దాం.
సాగిపోదాం సత్సంకల్పంతో,
దూసుకుపోదాం సదాయశంతో,
శిఖరాలు అధిరోహిద్దాం
సమధికోత్సాహంతో…
వేమూరి శ్రీనివాస్‌, 9912128967

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img