Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హాస్యరచనల ప్రాధాన్యత గొప్పది

‘నవ్వు నాలుగు విధాల చేటు’ అన్నది పనికిమాలిన పాత సంప్రదాయవాది ‘నవ్వు ఆరోగ్యానికి మేలు’ అన్నదే అసలు శాస్త్రీయ సత్యం. ‘నవ్వించటం ఒక భోగం..నవ్వటం యోగం..నవ్వకపోవటం రోగం’ అన్నది ప్రఖ్యాత సినీ రచయిత దర్శకుడు జంధ్యాల. సినిమా నటుడు ఎన్టీఆర్‌ హాస్య నటుడంటే చెప్పుచ్చుకుకొడతారు. అటువంటి ఆయన సాంఘిక చిత్రాలన్నీ సగానికి సగం నవ్విస్తుండేవి. ‘గుండమ్మ కథ’ సినిమాలో అతని పాత్ర పూర్తిగా నవ్వింపుల కవ్వింపులే! పైగా పక్కన సీరియస్‌ ముఖంతో మహానటి సావిత్రి! ఎదురుగా సవాలుగా నిలిచినట్లు అక్కినేని తమ్ముడు పాత్ర! అయినా రాణించటానికి కారణం హాస్యం గొప్పతనంఅది తెలిసిన దర్శకుడు కె.వి.రెడ్డి గొప్పతనం! పోనీ సాహిత్యానికి అంతటి స్థాయి లేదుగదా అనవచ్చు. అయినా సరే హాస్య సన్నివేశాలూ పాత్రలూ రచనల్ని బతికించి, మనల్ని బతికించేవి. కృష్ణరాయలు తనల్ని నవ్వించి, భారం తగ్గించటానికే తెనాలి రామకృష్ణుణి ్ణచేరదీసాడని ప్రతీతి. రాజకీయాల్తో వేడెక్కిన బుర్రలను తేలికపరిచి కాస్త ఊపిరి అందిస్తాడనే హాస్యం పండిరచే తెనాలి కవిని ఆదరించాడట! అతని పేర చెప్పుకునే అన్ని జోకులూ అతనివా కావా అన్నది అప్రస్తుతం. ‘జోకు’ మాత్రమే ఆదరణీయం. ఒకరోజు అతను దారంట వెళుతుంటే ఓ వయ్యారిభామ వాకిట్లో నిలబడి ఇతణ్ణి ఏడిపించాలని ‘‘రామకృష్ణా.. కాళ్లు నొప్పి’’ అందట. ఆయన ఆగి ‘ఏల కాళ్లు నొప్పి బాలామణి నీకు ఎవరి స్వప్నసీమ కేగివచ్చె?’ అన్నాడట. ‘ఓరి నీ జిమ్మడ…అంత మాటన్నావే’ అందట. ‘ఎంత తీయని పెదవులే యింతి నీవి…తిట్టుచున్నప్పుడున్‌ కూడ తీపి కురియు’ అని బదులిచ్చాడట. ఆమె మరింత ఆగ్రహించి ‘అయ్యో…నీ నోరు పడిపోను’ అందట!
‘ఎవరి వొడిలోన పడిపోను ఏమిచేతు..పడతి యొక్కతె కావలె పంకజాక్షి అనేసరికి సిగ్గుపడి’ క్షమించు రామకృష్ణా..ఉత్తసామాన్యుడి వనుకున్నాను’ అని చేతులు జోడిరచిదట! అందుకేనేమో. విమర్శకులందరూ…..A jశీసవ ఱం aశ్రీషaవం a ంవతీఱశీబం ్‌ష్ట్రఱఅస్త్ర అన్నారు. అసలు హాస్యరచనలు అన్నీ జీవితానికి విలోమ దృశ్యాలే! ముళ్లపూడి వెంకటరమణ రచన ల్లోని హాస్యమంతా జీవిత చిత్రణే. రాజకీయ నాయకుల ‘లత్తుకోరు’ వ్యవహారాల చిత్రణే… బుడుగు, గిరీశం లెక్చర్లు అన్నీ సామాజిక విమర్శనాస్త్రాలే. అసలు గిరీశం సృష్టికర్త గురజాడ తెలుగువారి వెలుగుదారి. ఆధునిక సాహిత్య పితామహుడు అని అందరూ ఎందుకన్నారు. ఆయన ఆధునిక సాహిత్యానికి దారి చూపినవాడు. ఆ దారిదీపం వెలిగించ టానికి ‘హాస్యం’ టార్చిలైటుగా ఎంచుకున్నాడు. నీతిశాస్త్రం బోధిస్తే ప్రజలు మర్చిపోతారు అని గ్రహించాడాయన. ఆయన వారసత్వాన్ని సామ్యవాద మహోద్యమానికి కలాన్ని బలాన్ని యిచ్చిన శ్రీశ్రీ స్వీకరించి పెంపొందించాడు. ఆయన హాస్యంలో సైతం పండిరచిన కవితలున్నాయి. ‘‘విగ్గేల కృష్ణశాస్త్రికిముగ్గేలా తాజమహలు మునివాకిటిలో సిగ్గేలా భావకవికి సిరిసిరిమువ్వా’’ అన్నాడు. ఎవరో అన్నట్లు ‘ముళ్లపూడి వెంకటకవివ్యంగ్యానికి నిశితపవి. ఓడ్‌ హౌస్‌ (ఇంగ్లీషు కవి ూణజు నశీబంవ) కు తెలుగు చవి’! ముళ్లపూడి కథలూ గిరీశం లెక్చర్లూ నవ్వులు కురిపించిన మాట వాస్తవం. భమిడిపాటి కామేశ్వరరావు, రాధాకృష్ణల నాటకాలన్నీ హాస్య ప్రధానాలే. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచనలు ప్రధానోద్దేశ్యం హాస్యం కాదని అనలేం. గురజాడ మార్గంలో నడిచిన కె.యన్‌.వై.పతంజలి వ్యంగ్యాన్ని ప్రాణంగా స్వీకరించి బాణంగా తయారుచేశాడు. అదే దారిలో నడిచిన చింతక్రింది శ్రీనివాసరావు విజయనగరం వారసత్వాన్ని నింపి వ్యంగ్యాన్ని పదునెక్కించారు. హాస్యనటుడు బ్రహ్మానందం ఓ సభలో మాట్లాడుతూ ‘నన్ను సృష్టించింది దర్శకుడు, రచయిత జంధ్యాలగారే’ అన్నాడు. తాను స్వయంగా హాస్యనటనా చమత్కృతి ఉన్నవాడే గదా… అయినా సరే అతని పాత్రలను కొలిచి, మలిచి తీర్చిదిద్దటంలో జంధ్యాల రచయిత కూడా కావటం బాధ్యత వహించింది! ఈవేళ సినిమాలు కేవలం హాస్యం మీద బతుకుతున్నాయంటే అసత్యం కాబోదు. పాత్రలెవరైనాస్వభావం ఏదైనా వ్యక్తీకరణ చిత్రీకరణ నవ్వులు కురిపించే విధంగా నడిచి గమ్యం చేరుకుంటున్నాయి. సీరియస్‌ ధోరణికి డబ్బులు రాలటం లేదు. సాహిత్యంలో ఒక్క కుటుంబరావు తప్ప, ఆయనకు ద్వితీయుడైన గుడిపాటి వెంకటచలం అడుగడుగునా వెటకారాలే. ఒక యువకుడు ఆయనకు లేఖ రాస్తూ ‘‘తెలుగు జాతిని శృంగార కామవాంఛలు వేపు మళ్లించిన మీరు మాకు క్షమాపణ చెప్పాలి’’ అన్నాడు ఆయన సమాధానం కార్డుముక్క మీద రాస్తూ ‘‘అలాగే..సోదరా…యీలోగా ‘ఇంతటి మాటలు అన్న నీవు..ఒక చిన్ని కాగితం మీద ప్రక్కింటి అమ్మాయికి ప్రేమలేఖ రాయి. ఆమె జవాబు రాగానే నీకు క్షమాపణలు పంపుతాను’ అన్నాడట! ఒక పుస్తకాన్ని చలంగారు అంకితమిస్తూ ‘‘నన్ను బాధించి, వేధించి, సాధించి నడిపించిన స్త్రీ జాతికి అంకితం’’ అన్నాడు. చలంగారి మాటలు నవ్వుల మూటలు. భావాలు అగ్గిబరాటాల తూటాలు. పురాణం సీత ‘ఇల్లాలి ముచ్చట్లు 15 ఏళ్లకు పైబడి సీరియల్‌గా వచ్చాయి. ఆపాదమస్తకం జోకుల్తో ..సీరియస్‌ భావాల బాంబులు ప్రేలుస్తూ!’’ ప్రొద్దునే లేచి నేను పేపరు చదువుతూ కూర్చుంటాను. నేను ఇంటలెక్చువల్‌ని కదా..నా భార్య నా కోసం టిఫిన్‌ తయారు చేస్తుంటుంది. ఆవిడ వంట లెక్చువల్‌ కదా..ఇంట్లో ఆమెకు సాయం చేస్తూ పనిమనిషి అంట్లు తోముతుంది. ఆమె అంటలెక్చువల్‌ గదా! అన్నాడొక చోట..! ఇలా సాగేది నిర్విరామంగా… తర్వాత హాస్యరచనల్లో ఓ ప్రమాదం దాగి ఉంటుంది. జోక్‌ ప్రేలలేదో.. నీరు కారిపోయిందో..నీ ముహం మీద విసిరి కొడతారు పాఠకులు. మిగతా రసాలు పండకపోయినా ఏమీ అనరు. హాస్యరసం పండలేదో..నవ్వురాని వాక్యం పడిరదో కారణం ఏమిటీ అని అడగరు. ముందు ముఖం మీద కలం, కాగితం విసిరికొడతారంతే! కరుణ, శృంగారం, వీరం, భయానక యిత్యాది రసాలు ప్యాసయినా, ఫెయిలయినా ఓ ముక్క కూడా అనరు. అందుచేత హాస్యరచయిత అనిపించుకోవటం సులభం కాదు. పైగా రచయితల మహాసభల్లో హాస్య రచయిత కూర్చున్నాడో చచ్చాడన్నమాటే. మిగతా వారిని విస్మరించి ‘ఫలానా ముళ్లపూడి , భమిడిపాటి, నరసరాజు, జంధ్యాల మాట్లాడాలోచ్‌’ అని కేకలేస్తారు. తీరా మొదలెడితే జోకు మీద జోకులు వేసి వినిపించాలి. జోక్‌ పేలలేదో..‘జనగణమన’ ఆలపిస్తారు!!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img