Friday, April 19, 2024
Friday, April 19, 2024

13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం

జాతీయస్థాయిలో గతపన్నెండేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగుసాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగుకథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నాము…
బహుమతుల వివరాలు-
అత్యుత్తమ కథకు రూ.2500/- ఉత్తమ కథకు రూ.1500/-
మంచి కథకు రూ.1000/-
ప్రత్యేక బహుమతులు రూ.500/-చొప్పున ఇద్దరికి …
`ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో రెండు నుంచి 4 పేజీలలోపు, డి.టి.పిలోనైతే 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాయాలి. ఎటువంటి ఎంట్రీ ఫీజులేని ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథ పుటలపై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి.
కథలను సెప్టెంబర్‌ 30వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్‌:9247475975) అనే చిరునామాకు పంపాలి. విజేతలకు నగదు బహుమతులతోపాటు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ప్రత్యేక సభలో సత్కరించ బడుతుంది.
సోమేపల్లి వెంకటసుబ్బయ్య చలపాక ప్రకాష్‌
అవార్డు కమిటీ ఛ్కెర్మన్‌ ఎడిటర్‌, రమ్యభారతి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img