Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

అనాగరిక బర్బరత్వం

నగ్నమయింది
ఆమె కాదు
మీ అనాగరిక
బర్బరత్వం-
సిగ్గు పడాల్సిందీ
ఆమె కాదు
నేరపూరిత
మౌనప్రభుత్వం
హత్యకు గురయిందీ
ఆమె కాదు
నిలువలేకపోయిన
మానవత్వం
కాలి బూడిదయిందీ
ఆమె కాదు
వ్యవస్థ చుట్టుకున్న
వస్త్రం!
-కే. ఆనందాచారి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img