పల్లవి
మనువాదం పడగకింద…
మణిపూరులో మంటవుట్టె…!
మతం పిచ్చి నెత్తి కెక్కి
హిందుత్వ మేటీగాళ్ళు…
ఊరి మీద దాడి చేసి
కొంపలను తగులవెట్టె….
పట్టపగలే నడివీదిలో
నగ్నంగా నడిపిస్తూ..
మదమెక్కిన కీచకులు
మానాలను దోసిరి…
వికృత క్రీడలకు తెరలేపసాగిరి
ఆడవాళ్ల కండ్ల ముందే….
మగవాళ్ళను సంపిరి…
మగవాళ్ళ కండ్ల ముందే…
ఆడవాళ్ల నెత్తుకెళ్లి….
అత్యాచారం జరిపిరి…!
బలుపెక్కిన కామాంధులు…
బరితెగించి పోయి నేడు…!
దేశ పరువునంతా మంటల్లోకలిపిరి
హిందుత్వ మేటీలు ఊర కుక్కలై ఉర్కి
కుకీల వర్గాన్ని ఖూనీ చేస్తూ ఉంటే…
పోలీసు బలగాలు, పాలక వర్గాల తీరు
మన్నుదిన్న పామోలే కదులకుండ ఉంటుంటే
ఎక్కడుంది రక్షణ ?ఏది మహిళకు రక్షణ?
గాయమైన సివంగివై గాండ్రిరచు ఓ చెల్లెమ్మ
పూలనిదేవి అడుగువై ప్రతినపూని లేవమ్మా
దేశమంతా నీకు తోడు గొడుగై నిల్చున్నదమ్మ
(మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం జరిపిన ఘటన సందర్భంగా స్పందించి రాసిన గీతం)
-జి. చంద్రమోహన్ గౌడ్, 9866510399