గ్రంథ సమీక్ష
వర్తమానంలో తెలుగు కథకులు ఎంచుకుంటున్న విషయ పరిణతిపరిమితి వైవిధ్యతల్ని కనపరుస్తోంది. అసలు కథకుని ప్రయాణంలోంచి సమాజం స్వీయాను భవాలు సహజాతంగా వేలుపట్టి నడిపిస్తున్న అనుభూతి పాఠక ప్రతిక్రియకు దోహదపడ్తుంది. నవలా కారుడు, కవి, కథకుడు అయిన వారణాసి
రాశిలో వాసి గల రచనలుగా అనేక పత్రికల్లో బహుమతులు, అంతర్జాలం, ఆధునిక గ్రూప్స్‌లోకి విస్తరించటం జరిగింది. వృత్తిరీత్యా వివిధ హోదాలలో అనేక ప్రముఖ కంపెనీలలో పనిచేసిన భానుమూర్తి సమాజగతంగా తన ప్రవృత్తిని పదిలపర్చుకునే ప్రయత్నంలో భాగంగా 3 కవితా సంపుటులు సాగర మథనం (2000) సముద్రఘోష (2005) మట్టివేదం (2022) లో ప్రచురించారు.
బహుముఖ ప్రశంసలందుకున్న నవలారాజు, సంస్కార సమేత రెడ్డినాయుడు అని ప్రశంసలందు కున్నారు. ఇటీవల వెలువరించిన ‘‘పెద్దకొడుకు’’ కధాసంపుటిలో పథకోణాలన్నీ మాండలికం సరళ గంభీరంతో బాటు సాధారణ నగర జీవన శైలి సంభాషణలు కూడా చోటు చేసుకోవడంలోని నైపుణ్యం విశదమవు తుంది. స్థూలంగా భానుమూర్తి కథలన్నీ పాత్రల స్వభావం, మనస్తత్వం సహానుభూతుల్ని పంచేవిగా ఉండటం గమనిస్తాము.
కర్మానుసారే కథలోని సందేశంతో మట్టి అనుబంధం, అమ్మ ప్రేమ, ఆత్మస్థైర్యం మనోబలంతో సాధించగలిగిన విజయాలు చౌడమ్మ, ఎంకట్రావుల నుంచి రచయిత సందేశం ప్రారబ్ద కర్మ నుంచి ప్రేరణ మానసిక ధైర్యం మంచి పనులకి రూపమయ్యింది. వస్తుతః కథలన్నీ తరాల అంతరాల్ని మారుతున్న సమాజ గతవేదనల్ని, ఆర్ద్రతల్ని వ్యక్తిత్వపు విలువల్ని చాటిన తత్వం, కథనం విశేషంగా కన్పించడం గమనించవచ్చును. ‘‘వృద్ధుడి చరమాంకం’’ కథలోని ధైన్యం కలచివేసిన ముగింపు, తల్లితండ్రుల ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని మనో వైచిత్రినిధన
జన సంబంధాల సామ్యంతో, భార్యను కోల్పోయిన వృద్ధునికి మానసిక చేయూతనిచ్చిన రాజమ్మలు యింకా కొంతమందైనా మానవీయతను నిల్పారు. ఉత్తమ శిష్యుడు కథనంలో గురుభక్తిని సార్వజనీనం చేసిన సంభాషణలు నీతికథని తలపించాయి.
అతనుఆమె కథలోని వ్యామోహపరత్వం స్నేహం ముసుగులోని ద్రోహ చింతన ద్వారా మధులాంటి వాళ్లు నేడు కోకొల్లలుగా కన్పిస్తారు. కోమలి
రాజారావుల పాత్రల సౌమనస్యం విలువల్నిచ్చింది. రంగుల ప్రపంచం కథని సమాజ వర్గంలోని సంపన్న దంపతుల్లో భార్య మనస్తత్వాన్ని మార్చే మానవీయ సంఘటన రూపకల్పన సన్నివేశబలం బర్త్‌డే పార్టీకి ఐదులక్షలు ఖర్చుపెట్టే ధనవంతులున్న దేశంలో పుట్టిన పిల్లలకు పాలు కూడ పట్టలేని ఆగర్భదరిద్రులు గురించిన సాపేక్ష సానుభూతి కలచివేస్తుంది. తిరిగే దేముళ్లు కథలో స్నేహం, దేముడు మనుషుల్లోంచి కృతజ్ఞతాభావాలు తెల్పారు. ‘‘రెడ్డమ్మ’’ కథనంలో అంతర్లీనంగా కష్టం విలువ కఠోర సాధన దరిమిలా పొందిన విజయాల్ని చెప్పారు. మొత్తం 19 కథలు జీవన వాస్తవికతలు నేల విడిచి సాము చెయ్యలేదు. రచయితకు మరింత పేరుతెస్తాయి.
`వి.యస్.ఆర్.ఎస్.సోమయాజులు, సెల్: 9441148158