Monday, September 25, 2023
Monday, September 25, 2023

విజయ చిహ్నాలు

అయ్యో, నా ప్రియమైన కుకి తల్లులారా,
మన దేహాలు యుద్ధ క్షేత్రాలు
మగవాళ్లు నీళ్ల సీసా కోసం
కొట్లాడుకున్నా సరే
మొట్టమొదట తిట్టేది
మననూ మన అమ్మలనే.
నీ తల్లిని నీ చెల్లిని…
అవే అన్నిటికన్న ఎక్కువగా
వాడే తిట్లు!
మనను ఊరేగిస్తారు
బట్టలూడదీస్తారు
అత్యాచారం చేస్తారు
రక్కుతారు కొరుకుతారు
చితకబొడుస్తారు
మనం భారతమాత బిడ్డలం గదా…
మన దేహాలే
వారి విజయ పతకాలు.
ఇది
ఎల్లప్పుడూ ఇలాగే ఉంది
మన దేహాల మీద
మగవాళ్లు యుద్ధం చేసుకుంటారు
మన రొమ్ములను వాళ్లు తగులబెడతారు
మనను యుద్ధ బాధితులుగా పిలుస్తారు
అయ్యో, నా కుకి తల్లీ,
మగవాళ్లు యుద్ధం ఆట ఆడుకుని
యుద్ధరంగం మీదనో
పొదలలోనో విందులు కుడిచి
మన దేహాలు వదిలిపోతారు
ఈ పురుష దేశంలో
మనను చిందరవందర చేయడానికి
రెండు వేళ్లతో విజయచిహ్నాలు చూపుతూ
మనను ఊరేగించడానికి
మనకు వాళ్లు ఎన్నెన్నో పేర్లు పెట్టారు…
(పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌమితా ఆలం ఇంగ్లిష్‌లో కవిత్వం రాస్తారు. ఆమె కవితా సంపుటం ది మ్యూజింగ్స్‌ ఆఫ్‌ ది డార్క్‌ 2020లో వెలువడిరది. ఈ కవిత ఔట్‌ లుక్‌ పత్రికలో అచ్చయింది.)
-మౌమితా ఆలం, తెలుగు: ఎన్‌ వేణుగోపాల్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img