మనిషి జాగా కోరితే గాజాల
హింసకు గురి కావాల్సిందేనా
విశ్వం ముఖచిత్ర విషాదంగా మిగిలిపోవాలా?పలస్తీనా?
ఇంకెక్కడి మానవహక్కులు
ఎక్కడ ఐరాస శాంతిజాడలు
దీనులైన పలస్తీనీయులను
నెట్టేస్తూ దౌష్ట్యం విప్పే రెక్కలు
దశాబ్దాల తరబడి నీడ కోసం
పరితపించడం అనంత శోకం
కనీస హక్కుకొరకు గొంతెత్తితే
ఉగ్రవాద ముద్రే రాజశాసనం
రాబందుల రాక్షస రుధిర క్రీడలో
శాంతి పిట్టలకు నెలవులు లేవు
జాతి ద్వేషం జ్వలించే తావులో
మానవత్వం చివుళ్లు వేయవు
సోదరత్వం మచ్చుకు కానరాక
నచ్చనివారిని బలిచ్చే ఆటవికం
యజ్ఞ వాటికగా వర్ధిల్లుతూంటే
పచ్చదనం మాడి బీడయిపోదా
మాది శాంతిభూమి అన్న పెద్దలు
నేడు గద్దల పక్షంచేరి రాగంతీస్తే
‘సత్యంవధ’jైు తలవంచుకోదా
పావురాళ్ళు బావురుమనవా?
శాంతిఒప్పందాలు చెత్తలో నెట్టి
భూమిచెరబట్టిన వలసరాజ్యం
దశాబ్దాల నరహంతక దుర్నీతిని
గ్రహించింది జనహృదయనేత్రం
ప్రతిచోటా విముక్తి యుద్ధగీతం
చరిత్ర దారిలో నెత్తుటి తర్పణం
స్వేచ్ఛకై పోరుచేసిన తోటి జనం
నీకు తెలుపునులే సంఫీుభావం
పాలస్తీనా! నీ ఉనికి మాయం చేయగా
రాజ్య విస్తరణ పిశాచి
విసిరింది విషాన్ని కోరలుసాచి
తప్పదు తెగించు నడుం బిగించి
గోలి సీతారామయ్య, 9949145650